
25న పెద్ద శేష వాహన సేవ
తిరుమల: తిరుమలలో అక్టోబర్ 25న నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్ద శేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు.ఆ దిశేషువు జగన్నాథునికి తల్పంగా స్వామివారికి సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు.
నేడు కలెక్టరేట్‌లో
ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.
వరసిద్ధుని సేవలో
జూనియర్ ఎన్టీఆర్ సతీమణి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని ఆదివారం సినీనటుడు జూనియ ర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి దర్శించుకున్నా రు. ఆమెతో పాటు సినీ నటుడు నార్నె నితిన్, వారి కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగ తం పలికి దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. వేద ఆశీర్వచనాలు, స్వామి ప్రసాదం, చిత్ర పటం అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీనాయుడు తదితరులున్నారు.