
ఆటో ఢీకొని చిన్నారి మృతి
నగరి : మండలంలోని మునెప్పనాయుడు కండ్రిగ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బిందుప్రియ (5) అనే చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రాజేష్ కుమార్తె బిందు ప్రియ వీధిలో ఆడుకుంటుండగా ఆ వైపు వేగంగా వచ్చిన ఆటో చిన్నారిని ఢీకొనడంతో పాటు చిన్నారిపై నుంచి పోవడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఉడుమును వేటాడిన
ఇద్దరు అరెస్టు
చిత్తూరు కార్పొరేషన్ : ఉడుమును వేటాడిన ఇద్దరి వ్యక్తులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బుధవారం అటవీశాఖ ఈస్ట్ ఎఫ్‌ఆర్‌వో థామస్ వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన జిల్లాలోని పాలసముద్రం మండలంలో ఉడుమును వేటాడిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వేటాడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ ఎఫ్‌ఎస్‌వో చండికుమార్, బీట్ ఆఫీసర్‌లు బాలాజీ, ప్రభాకర్‌రెడ్డి, గౌస్‌భాషా, తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీయూ వీసీగానర్సింగరావు
తిరుపతి సిటీ : ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ నర్సింగరావు బెనారస్ వర్సిటీలో పీజీ పూర్తి చేసి పలు ఐఐటీ కళాశాలల్లో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తించారు. మంత్రి లోకేష్ వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన ఎస్వీయూ వీసీగా నియమితులయ్యే అవకాశముందని రెండు నెలల ముందే సాక్షి పత్రిక పసిగట్టంది. ఈ మేరకు కథనాలు ప్రచురించడం గమనార్హం. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీని తమ ఆధీనంలో ఉంచుకోవడం కోసమే మంత్రి లోకేష్ తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తికి వైస్ చాన్సలర్ పదవిని కట్టబెట్టినట్లు జిల్లాలో విస్తృతంగా చర్చసాగుతోంది.

ఆటో ఢీకొని చిన్నారి మృతి

ఆటో ఢీకొని చిన్నారి మృతి