
కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో చోరీ
సదుం: మండలంలోని చెరుకువారిపల్లె శివార్లలో ఉన్న కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగలగొట్టి ఆలయంలో ప్రవేశించారు. ఆలయంలో ఉన్న బీరువాను చిందర వందర చేశారు. హుండీలో ఉన్న కొంత నగదును ఎత్తుకెళ్లారు. కాగా దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
జిల్లా నూతన కార్యవర్గం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నగరంలో మంగళవారం జిల్లా నాయీబ్రహ్మణ సంఘ నూత న కార్యవర్గాన్ని ఎనుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా చిట్టిబాబు, వెంకటేష్, అధ్యక్షుడిగా ప్రసా ద్, ఉపాధ్యక్షులుగా మురళి, లక్ష్మీకాంత్, కార్య దర్శులుగా ధనశేకర్, శివ, కోశాధికారిగా వాసు కిరన్, మురళీకృష్ణ, సహాయ కార్యదర్శిగా కార్తీక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ప్రచార కార్యదర్శులు, సభ్యులను నియమించుకున్నారు.
రాష్ట్ర స్థాయి ఎంపిక
కమిటీలో కార్తీక్‌కు చోటు
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎన్‌సీసీ అధికారి, ఉపాధ్యా యుడు కార్తీక్‌కు రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీలో చోటు లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్‌సీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఏటా ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల పరేడ్‌కి ఎన్‌సీసీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఆయన ఎంపికయ్యారు. ఆయన ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు సికింద్రాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి ఫ్రీ ఆర్‌డీసీ క్యాంప్‌లో పాల్గొంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తరఫున ఆయన ఎంపిక కావడంపై హెచ్‌ఎం హసన్‌బాషా, తోటి ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.

కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో చోరీ

కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో చోరీ