
అవగాహన కల్పించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మందులు, మాత్రల జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. మంగళవారం సాక్షి దినపత్రికలో ‘ఏ మాత్రం తగ్గలేదు’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన ఆమె చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆ శాఖ అధికారులు, వైద్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, అర్బన్ హెల్త్ సెంటర్, జిల్లా ఆస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రుల్లో మందులు, మాత్రల జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 19వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు విధిగా నిర్వహించాలన్నారు. ర్యాలీలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, డీఐఓ హనుమంతరావు, అధికారులు ప్రవీణ, అనూష, వేణుగోపాల్, శ్రీవాణి, రామ్మోహన్ పాల్గొన్నారు.

అవగాహన కల్పించాలి