
వాల్మీకి సేవలు మరువలేనివి
చిత్తూరు కలెక్టరేట్ : వాల్మీకి మహర్షి సేవలు మరువలేనివని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. వాల్మీకి జయంతి ని పురస్కరించుకుని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించారు. పాల్గొన్న కలెక్టర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మేయర్ అముద, బీసీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా, సూపరింటెండెంట్ శ్రీను పాల్గొన్నారు.
సావిత్రమ్మ కళాశాలలో..
నగరంలోని సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్.ఉషారాణి పాల్గొని ప్రసంగించారు. అధ్యాపకులు షమ్స్ అక్తర్ పాల్గొన్నారు.