
వారికి న్యాయవాదులు సహకరించకూడదు
మైనర్ బాలికలపై గ్యాంగ్‌రేప్, మహిళలపై అత్యాచారాలు చేస్తున్న కామాంధులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహకరించకూడదని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు కోరారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న దుర్మార్గపు కామాంధులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. ఆ నింధితులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహకరించకూడదన్నారు. గత ఐదు రోజులకు ముందు సీఎం సొంత జిల్లా పెనుమూరు క్రాస్ వద్ద అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన పార్కులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన ముగ్గురు కామాంధులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహాయం చేయకూడదని కోరారు.