
ఆగని ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలో పంట పొలా లపై ఏనుగుల దాడులు ఆగడంలేదు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఏనుగులు పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తుండడంతో రైతు లు లబోదిబోమంటున్నారు. సోమవారం తెల్ల వారు జామున బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి వరి పంట, ప్రభాకర్‌రెడ్డి, రుక్మణమ్మకు చెందిన వేరుశనగ పంటను తొక్కి నాశనం చేశాయి. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను వేరే ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వరసిద్ధుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని సోమవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగ తం పలికి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు చేయగా.. ఏఈవో రవీంద్రబాబు స్వామి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

ఆగని ఏనుగుల దాడి