
కాంట్రాక్టర్‌కు పనులు..కర్షకులకు కన్నీళ్లు!
శాంతిపురం: కర్ణాటక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాలతో మండంలోనే పెద్ద దైన సోగడబళ్ల పెద్ద చెరువుకు చేరిన నీటిని వృథాగా కిందికి వదిలేశారు. పంచాయతీ కేంద్రమైన చెంగుబళ్ల గ్రామానికి పక్కనే ఉన్న ఈ చెరువు గట్టు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొరవ పనులు కూడా చేయాల్సి ఉంది. వర్షపు నీటితో ఈ పనులకు ఇబ్బంది కలుగుతుందని భావించిన కాంట్రాక్టర్ మొరవ పక్కనే దాదాపు ఐదు అడుగుల లోతుతో కాలువ తీసి నీటిని వృథాగా వదిలేశారని స్థానికులు చెబుతున్నారు. జల సంరక్షణ పనుల కోసం ప్రజాధనాన్ని ఖర్చుచేస్తుంటే పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన నీటిని వినియోగించుకోలేని పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు వాపోయారు. అధికారులు స్పందించి నీటి వృథాకు కారణమైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయకట్టుదార్లు, సమీప గ్రామాల రైతులు కోరుతున్నారు. కాంట్రాక్టర్లకు పనులు, బిల్లుల కోసం ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను విస్మరించారని స్థానిక సర్పంచ్ పూలకుంట భాస్కర్ వివమర్శించారు.
మొరవ పక్కన కాలువ తవ్వి నీటి విడుదల
సోగడబళ్ల పెద్ద చెరువు నుంచి వృథాగా పోతున్న నీరు

కాంట్రాక్టర్‌కు పనులు..కర్షకులకు కన్నీళ్లు!