
అవిశ్వాస తీర్మానంపై నోటీసులు
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట ఎంపీపీ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సోమవారం చిత్తూరు సీఈఓ, వడమాలపేట ఎంపీడీఓకు వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు నోటీసులు అందజేశారు. మండల అభివృద్ధికి ఎంపీపీ సహకరించడం లేదని, సభ్యుల విశ్వాసాన్ని కోల్పోయారని, ఫలితంగా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని నోటీసులో పేర్కొన్నారు. చట్టం ప్రకారం నోటీసు అందుకున్న 15 రోజుల్లోపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని సూచించారు. నోటీసులు అందజేసిన వారిలో వైస్ ఎంపీపీలు డీ.ఉపేంద్ర, వీ.లోకేష్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఎ.రవి, ఎ.ప్రతిమ, టి.పుష్పలత, ఇ.కనకమ్మ ఉన్నారు.