
సూపర్ సిక్స్.. అట్టర్ ప్లాప్
చిత్తూరు కార్పొరేషన్ : సూపర్ సిక్స్.. అట్టర్ ప్లాప్ అయ్యిందని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇంచార్జి విజయానందరెడ్డి విమర్శించారు. ఆదివారం చిత్తూరు నగరంలో నాల్గవ డివిజన్ కట్టమంచిలో కార్పొరేటర్ స్వరూపరాణి, నాయకులు మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆ డివిజన్‌లోని ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. వెఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ.. హామీలను అమలు చేయకుండా బాబు మోసగించారని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు అబద్దపు హామీలు గుప్పించి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.
16 లక్షల మంది ఉంటే 2.70 లక్షల మందికే..
కూటమి ప్రభుత్వం తాజాగా ఆటో డ్రైవర్‌లను మోసగించిందని విజయానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల పథకానికి 13 లక్షల మంది ఉంటే కేవలం 2.90 లక్షల మందికి ఇచ్చి పండగ చేసుకోమని చెప్పడం మోసం చేసినట్టేనని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ ఏటా రూ.15 వేలు చొప్పున 16 లక్షల మందికి అందజేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఆటో డ్రైవర్ల పథకం ఎగ్గొట్టారన్నారు. కట్టమంచి నుంచి సాంబయ్యకండ్రిగ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. రోడ్డు అలినేషన్ ఆర్‌అండ్‌బీకి మార్పు చేసేలా ఎమ్మెల్యే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
బాబు మోసాల నుంచి మేల్కోవాలి
చంద్రబాబు మోసాల నుంచి ప్రజలు మేల్కోవాలని విజయానందరెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో మహిళలకు రూ.18 వేలు, నిరుద్యోగులకు ఏటా రూ.36 వేలు ఇస్తామని ఎగ్గొట్టారన్నారు. అనంతరం క్యూ ఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ చుడా చైర్మన్ పురుషోత్తంరెడ్డి, నాయకులు జ్ఞాన జగదీష్, హరిణిరెడ్డి, రాహుల్‌రెడ్డి, శివారెడ్డి, మనోజ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, తిమ్ము, నారాయణ, బాబురెడ్డి, సోమురెడ్డి, శేఖర్‌రెడ్డి, అఖిలేష్ త దితరులుపాల్గొన్నారు.

సూపర్ సిక్స్.. అట్టర్ ప్లాప్