
గజరాజుల బీభత్సం
పులిచెర్ల(కల్లూరు) : పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని దిన్నెపాటి దళిత వాడ, బాలిరెడ్డిగారిపల్లె గ్రామాల్లో ఆదివారం తెల్లవారు జామున ఏనుగులు పంటలను నాశనం చేశాయి. వరుస దాడులతో పంటలను తీవ్రంగా నష్ట పరుస్తున్నాయి. సురేంద్రరెడ్డికి చెందిన వరిపంట, రుక్మణమ్మకు చెందిన టమాట పంటలను నాశనం చేశాయి. ఏనుగులు పులిచెర్ల మండలాన్ని వదిలిపోవడం లేదని ఇక్కడే తిష్టవేసి రోజూ పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
గల్లంతైన వ్యక్తి
మృతదేహం లభ్యం
వి.కోట : జలపాతంలో గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని పోలీ సులు, అగ్ని మాపక సిబ్బంది ఆధ్వర్యంలో వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన మండలంలోని గిడిగి జలపాతం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని చిన్నాగనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు (45) శనివా రం సాయంత్రం మండలంలోని గిడిగి జలపాతం చూసేందుకు సరదాగా వెళ్లాడు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశా త్తు జలపాతంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు ఆదివారం సంఘటన స్థలా నికి చేరుకుని గల్లంతైన శ్రీనివాసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలిసులు తెలిపారు.
అందాల హరివిల్లు
బైరెడ్డిపల్లె : బైరెడ్డిపల్లెలో రెండు ఇంద్ర ధనుస్సులు అక్కడి ప్రజలను కనువిందు చేశాయి. ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించుకున్నారు. సాధారణంగా వర్షం కురిసిన తరువాత ఒక ఇంద్ర ధనుస్సు వస్తుందని అయితే రెండు ఇంద్ర ధనుస్సులు ఒకేసారి రావడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.