
డీఎంహెచ్‌వో ఆదేశాలు బేఖాతర్
పలమనేరు: పలమనేరులో పీఎంపీలు డీఎంహెచ్‌ఓ బేఖాతర్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే వార్నింగ్ ఇచ్చి వెళ్లినా మళ్లీ సూదులేయడం, మాత్రలు ఇవ్వడం ప్రారంభించారు. మీరు క్లినిక్‌ను సీజ్ చేస్తే మా ప్లాన్ మాకుంటుందంటూ నిరూపిస్తున్నారు. ఇలాంటి ఘటనే శనివారం వెలుగు చూసింది. స్థానిక ఎస్‌బీఐ ఎదురుగా ఉన్న టీఎస్ రామచంద్రన్ పీఎంపీ క్లినిక్‌ను శుక్రవారం డీఎంహెచ్‌వో సుధారాణి దాడులు చేసి సీజ్ చేశారు. ఆమె ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఆ పీఎంపీ ముందు సీజ్‌చేసిన క్లినిక్ ఉంటే వెనుకవైపు రహస్యంగా మళ్లీ ట్రీట్‌మెంట్ చేయడం ప్రారంభించాడు. దీంతో పట్టణంలోని మిగిలిన పీఎంపీలు సైతం ఏ ధైర్యంతో ఆయన మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడంటూ విస్తుపోతున్నారు. ఆ పీఎంపీకి పట్టణానికి చెందిన ఓ అధికార పార్టీ నేత అండదండలున్నందునే మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడనే మాట వినిపిస్తోంది. దీనిపై డీఎంహెచ్‌వో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

డీఎంహెచ్‌వో ఆదేశాలు బేఖాతర్