
చోరీ కేసులో ఐదుగురి అరెస్ట్
పలమనేరు: పట్టణంలో గత నెల 26న మున్సిపాలిటీ పరిధిలోని గడ్డూరు గ్రామంలో మోహనకుమారి ఇంట్లో చోరీకి సంబంధించిన కేసులో ఐదుగురు నిందితులను పట్టణ సమీపంలోని ఆంజినేయస్వామి ఆలయం వద్ద శుక్రవారం అరెస్ట్ చేసినట్టు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. వీరి నుంచి 68 గ్రాముల బంగారు నగలు, కొన్ని రోల్‌గోల్డ్ నగలు, రూ.90 వేల నగదు, చోరీకి వాడిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. స్థానిక కేవీ స్ట్రీట్‌కు చెందిన సయ్యద్ అల్తాఫ్(17), నాగమంగళానికి చెందిన సయ్యద్ జావీద్(20), గడ్డూరు కాలనీకి చెందిన హరి(24), డీసీ స్ట్రీట్‌కు చెందిన ఫైజాన్ అహ్మద్(19), సాయిగార్డెన్స్‌కు చెందిన వినయ్‌కుమార్(25)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు. ఇదే కేసులో మరో నిందితుడైన సందీప్ పరారీలో ఉన్నాడని, ఇతన్ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఇందులో సీఐ మురళీమోహన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.