
రెండిళ్లలో చోరీ
నగరి : మండలంలోని ముడిపల్లె గ్రామంలో రెండిళ్లలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. వివరాలు.. ముడిపల్లెకి చెందిన నాగరాజస్వామి బుధవారం బొమ్మలకొలువు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న మరో నివాసంలో రాత్రి బస చేశారు. ఉదయం నివాసానికి వెళ్లి చూడగా ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉంచిన 30 వేల నగదు, బొమ్మల కొలువులో అమ్మవారికి వేసిన రెండు సవరాల బంగారు గొలుసు చోరీ చేసి ఉండడం గమనించారు. ఆ నివాసానికి పక్కనే ఉన్న మరో నివాసంలో నివసించే నాగరాజు అనే ఉద్యోగి ఉద్యోగరీత్యా నగరి పట్టణంలో నివాసం ఉంటున్నారు. తన నివాసం పక్కనే ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలుసుకొని తన నివాసం వద్దకు వెళ్లి చూడగా ఆయన ఇంటి గొళెం కూడా తొలగించి ఉంది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. పూజ గదిలో ఉంచిన ఒక సవరం బంగారు నగలు చోరీకి గురయ్యాయి.