పిడికిలి బిగించిన పల్లె వైద్యులు! | - | Sakshi
Sakshi News home page

పిడికిలి బిగించిన పల్లె వైద్యులు!

Oct 4 2025 1:57 AM | Updated on Oct 4 2025 1:57 AM

పిడికిలి బిగించిన పల్లె వైద్యులు!

పిడికిలి బిగించిన పల్లె వైద్యులు!

● జిల్లాలో పీహెచ్‌సీ వైద్యుల విధుల బహిష్కరణ ● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎదుట సమ్మెకు దిగిన వైనం ● సమ్మెతో పల్లె వైద్యం దూరం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో పల్లైవెద్యులు పిడికిలి బిగించారు. శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. డిమాండ్ల పరిష్కారం కోసం నినాదాలు మిన్నంటించారు. వైద్యుల సమ్మెతో రోగులు విలవిల్లాడిపోయారు. మొదలే సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్న వారు ఆర్‌ఎంపీలను ఆశ్రయించారు.

వ్యాధుల విజృంభణ

సీజనల్‌ వ్యాధులైన జలుబు, దగ్గు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాలకు మంచినీరు కలుషితమైపోవడంతో చాపకింద నీరులా విరేచనాలు ప్రబలుతున్నా యి. ఇలాంటి కీలక సమయంలో అధికారులతో సమ న్వయం చేసుకొని చర్యలు తీసుకోవడంతో పాటు, వైద్యులను సమ్మెలోకి వెళ్లకుండా చూడాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడిన చందంగా ప్రాథమిక వైద్యుల సమ్మెతో అసలే అంతంత మాత్రంగా అందుతున్న వైద్య సేవలు కూడా కొండె క్కాయి. గ్రామీణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

కార్యాలయం ఎదుట నిరసన

రాష్ట్ర యూనియన్‌ నాయకుల పిలుపుతో శుక్రవా రం పీహెచ్‌సీ వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 50 మందికి పైగా వైద్యులు విధులను పక్కన బెట్టి సమ్మెలోకి దిగారు. దీంతో వైద్య సేవలు స్తంభించాయి. 104 సేవలకు సైతం బ్రేకులు పడ్డాయి. పల్లె జనం వైద్యం అందక పట్టణం, ప్రయివేటు వైద్యం కోసం పరుగులు పెట్టారు. కాగా వైద్యులు శిరీషా, ఎల్లయ్య, చంద్ర మహేష్‌ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

పీజీ వైద్యులతో..

జిల్లాలో 50 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరేసి వైద్యులు ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో 90 మంది వైద్యులు పనిచేస్తున్నారు. మూడు రోజులుగా పీహెచ్‌సీ వైద్యులు అని వార్య కారణాలతో స్టెతస్కోప్‌ పక్కన పెట్టేశారు. గతంలో పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులకు పీజీలో 30 శాతం సీట్ల కోటా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే ఏకపక్షంగా సీట్ల కోటాను 15 శాతానికి తగ్గించేసింది. ఎంబీబీఎస్‌ వైద్యుల ఆశలపై నీళ్లు చల్లింది. దాంతో వైద్యులు ఆందోళన బాటపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం 20 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒక ఏడాది మాత్రమే దాన్ని అమలు చేసిన ఆ తర్వాత పట్టించుకోకుండా పోయింది. ఈ సమస్యపై గత కొన్నాళ్ల నుంచి మిన్నకుండిపోవడంతో సమ్మెబాట పట్టాల్సి వచ్చింది. అధికారులు పలు పీహెచ్‌సీలకు పీజీ వైద్యులను తీసుకున్నారు. అదీ ఒక్కో డాక్టర్‌ను మాత్రమే నియమించారు. డాక్టర్లు లేని కారణంగా చాలా చోట్ల స్టాప్‌ నర్సులే వైద్యం చేసి మందు బిళ్లలిచ్చి రోగులను పంపించేశారు. రక్త పరీక్షలు, ఇతరత్రా సేవలన్నీ పడకేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement