
స్వచ్ఛతలో ఆరు రాష్ట్ర స్థాయి అవార్డులు
చిత్తూరు అర్బన్: పరిశుభ్రత–స్వచ్ఛత కార్యక్రమంలో జిల్లాకు ఆరు అవా ర్డులు లభించాయి. గురువారం చిత్తూ రు కలెక్టరేట్ కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకల్ని నిర్వహించిన అనంతరం కలెక్టర్ సుమిత్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ మునిసిపాలిటీల విభాగంలో పలమనేరు, కుప్పం.. ఉత్తమ గ్రామ పంచాయతీ విభాగంలో కనుమాకులపల్లె (శాంతిపురం), స్వచ్ఛ అంగన్వాడీ కేంద్రం–కామినాయనిపల్లె (ఐరాల).. స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయం– కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ), స్వచ్ఛ బస్ స్టేషన్ విభాగంలో చిత్తూరు బస్‌స్టాండు రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికై నట్లు కలెక్టర్ వెల్లడించారు. అక్టోబర్ 6న విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డులు అందుకోనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో 48 అవార్డులు
స్వచ్ఛత విభాగంలో జిల్లా స్థాయిలో 17 విభాగాల్లో 48 అవార్డులు ఇవ్వనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ నెల నెల 6న చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో జరగనున్న వేడుకల్లో వీటిన ప్రదానం చేస్తామన్నారు. స్వచ్ఛ పురపాలక–పుంగనూరు, స్వచ్ఛ ఆంగన్‌వాడీ కేంద్రాలు–ఇరికి పెంట (సోమల), ఆగరమంగళం (జీడీనెల్లూరు), బందార్లపల్లె (రామకుప్పం), మహాసముద్రం (బంగారుపాళ్యం) స్వచ్ఛ ప్రభుత్వ కార్యాల యం–జెడ్పీ కార్యాలయం చిత్తూరు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చిత్తూరు. స్వచ్ఛ పరిశ్రమ– షాహి ఎక్స్‌ఫర్ట్ స్వచ్ఛ ఎంఎస్‌ఎంఈ –రావాండ్స్ ప్లాస్టిక్, విశ్వా ఆపీరియల్స్ స్వచ్ఛ హాస్టల్–ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ (నగరి), ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్ (కుప్పం), ప్రభుత్వ గిరిజన బాలుర హాస్టల్ (కుప్పం). స్వచ్ఛ రెసిడెన్షియల్ పాఠశాల–డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం సర్వేరెడ్డిపల్లె (జీడీనెల్లూరు) స్వచ్ఛ ఆస్పత్రి–పీహెచ్సీ కొత్తపల్లె (కుప్పం), ఏరియా ఆస్పత్రి పలమనేరు, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి స్వచ్ఛ పాఠశాల– ఏపీ మోడల్ స్కూల్ తుమ్మిసి (శాంతిపురం), కేజీనీబీ (బైరెడ్డిపల్లె) జెడ్పీ ఉన్నత పాఠశాల బీరప్పచెరువు (ఐరాల), ఎంపీపీఎస్ కమ్మపల్లె (పులిచెర్ల), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బంగారుపాళ్యం) స్వచ్ఛ వారియర్స్– వెంకటేష్ (చిత్తూరు), శ్రీనివాసులు (పలమనేరు), రవిచంద్రన్ (నగరి), గంగమ్మ (కుప్పం), హరిబాబు (పుంగనూరు) స్వచ్ఛ హరిత రాయబారులు –విజయకుమార్ (అగరంపల్లె), బాలకష్ణ (పెద్దచల్లారగుంట), సావిత్రి (తూర్పు మాదిగవాడ), నాగరాజు (పెద్దచల్లారగుంట), బాలకృష్ణ (కొలమాసనపల్లె) స్వచ్ఛ గ్రామ పంచాయతీ–యమగానిపల్లె (గుడుపల్లె), కాణిపాకం (ఐరాల), కంగుంది (కుప్పం), మల్లానూరు (కుప్పం) స్వచ్ఛ స్లమ్‌లెవల్ ఫెడరేషన్–పొన్నెమ్మ మహిళా సమాఖ్య (నగరి) శ్రీలంజనేయ మహిళా సమాఖ్య (నగరి), శ్రీ విరుపాక్షి మహిళా సమాఖ్య (చిత్తూరు). స్వచ్ఛ రైతు బజారు కుప్పం వ్యవసాయ మార్కెట్, స్వచ్ఛ గ్రామ సంఘం–గడ్డంవారిపల్లె (చౌడేపల్లె), కొల్లాగుంట (కార్వేటినగరం) మాంగాడు (నగరి), ఏకరపల్లె (కుప్పం), నల్లిశెట్టిపల్లె (తవణంపల్లె) స్వచ్ఛ ఎన్జీవో– నేచుర్ లవర్స్ అసోసియేషన్ (చిత్తూరు), నాగమణి చారిటబుల్ ట్రస్ట్ (పలమనేరు), పలమనేరు పరిరక్షణ సమితి (పలమనేరు) ఎంపికయ్యిందన్నారు.