
మీరే సూదులేస్తారా?
ఏ ధైర్యంతో రోగులకు సైలెన్
పెడుతున్నారు
టీఎస్ రామచంద్రన్ పీఎంపీ క్లినిక్‌పై చర్యలు
క్రిష్టల్ ల్యాబ్‌లో నిబంధనలు లేవని నిర్థారణ
పలమనేరులో డీఎంఅండ్‌హెచ్‌వో
ఆకస్మిక దాడులు
పలమనేరు: ‘మీరసలే ప్రాథమిక వైద్యం చేయాల్సిన వారు.. ఎలా సూదులేస్తారు, మీరే మెడికల్స్ స్టోర్స్ ఎలా నిర్వహిస్తారు..?..’ అని డీఎంఅండ్‌హెచ్‌వో సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరులో కొందరు పీఎంపీలు సైలెన్ పెట్టడం, సూదులేయడం తదితరాలపై కొందరు ఇటీవల జిల్లా వైద్యశాఖాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన ఆమె శుక్రవారం పట్టణంలోని పీఎంపీలు, నిబంధనలు పాటించని మెడికల్ ల్యాబ్‌లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆ మేరకు ఎస్‌బీఐ ఎదురుగా ఉన్న టీఎస్ రామచంద్రన్, ఆయన సతీమణి మంజుల పీఎంపీలుగా ఉంటూ సూదులేయడం, వారే మందులనివ్వడం చూసి నిర్ఘాంతపోయారు. ఇలా ఇస్టానుసారంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతారా..? అంటూ నిలదీశారు. మరోవైపు మున్సిపల్ కాంప్లెక్స్‌లోని ఓ పీఎంపీ నిత్యం సైలెన్‌న్లు పెట్టడమే పనిగా పెట్టుకుందని తెలుసుకున్నారు. ఆమైపె ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. గంగమ్మతోపులోని క్లిస్టల్ ల్యాబ్ నిర్వాహకులు నిబంధనలు పాటించడంలేదని, వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పబ్లిక్ హెల్త్ యాక్టు మేరకు పీఎంపీలు ప్రాథమిక చికిత్సలు మాత్రమే చేయాలన్నారు. అయినా కొందరు కావాలనే సూదులేయడం, వారి వద్దే లైసెన్లు లేకుండా మెడికల్స్ నిర్వహించడం చేయడం తీవ్రమైన తప్పన్నారు. ఇకపై పలమనేరులోని ప్రతి ఆర్‌ఎంపీ, పీఎంపీపై ప్రత్యేక నిఽఘా ఉంటుందన్నారు.