
కేజీ కుప్పంలో భారీ చోరీ
నగరి : మండలంలోని కేజీ కుప్పం గ్రామానికి చెందిన నాగూర్ బాషా ఇంట్లో గురువారం రాత్రి 15 సవరాల బంగారు నగలు, అరకిలో వెండి, రూ.11 వేల నగదు చోరీ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 1న కుటుంబంతో సహా నాగూర్ బాషా తిరుపతికి వెళ్లి అక్కడ కుమార్తెను తీసుకొని 2వ తేదీ ఉదయం పెళ్లి చూపుల నిమిత్తం కడపకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆలస్యం కావడంతో రాత్రి తిరుపతిలో బసచేసి ఉదయాన్నే వచ్చేందుకు నిర్ణయించుకొని ఆగిపోయారు. ఇంటివద్ద ఎవరూ లేకపోవడాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయాన్నే ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడం, వస్తువులు చిందరవందరగా పడివుండడం చూసిన స్థానికులు నాగూర్ బాషాకు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన కేజీ కుప్పం చేరుకున్నని ఇంటిలోకి వెళ్లి చూడగా 15 సవరాల బంగారు నగలు, అరకిలో వెండి, రూ.11 వేలు నగదు చోరీ అయినట్లు గుర్తించారు. చోరీ జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.