
పదోన్నతులు
చిత్తూరు అర్బన్: డీఈఓ పరిధిలోని పండిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించాయి. ఎంతో కాలంగా 166 మంది పండిట్లకు ఎట్టకేలకు పదోన్నతులు దక్కాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర విద్యశాఖ నుంచి గురువారం మధ్యాహ్నం రాగా.. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు రాత్రి 12.30 నుంచి 2.30 గంటలకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయులకు ఎన్‌ఏలుగా పదోన్నతి, పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు.
మదపుటేనుగుల సంచారం
పలమనేరు : మండలంలోని మొసలిమడుగు సమీపంలోని కుంకీ ప్రాజెక్టు వద్ద బుధవారం రాత్రి మదపుటేనుగులు సంచరించినట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన పలువురు రైతుల వరిపైర్లను నాశనం చేశాయని వాపోయారు. అలాగే అరటి తోటలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. గజదాడులను అరికట్టేందుకు ప్రభుత్వం తెప్పించిన కుంకీ ఏనుగుల సమీపంలోనే మదపుటేనుగులు సంచరిస్తున్నట్లు తెలిపారు. కుంకీల కారణంగా తమ పంటలకు మరింత నష్టాలు వచ్చే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.