
దుర్గమ్మకు క్షీరాభిషేకం
దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా వి.కోట లోని దుర్గామాత ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే క్షీర కలశాల శోభాయాత్ర మంగళవారం ఘనంగా నిర్వహించారు. 4,005 మంది మహిళలు క్షీర కలశాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీపీ యువరాజ్ కుటుంబ సమేతంగా ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ప్రాంగణంలో చండీహోమం నిర్వహించారు. తొలుత వేణుగోపాలస్వామి ఆలయం వద్ద పట్టు వస్త్రాల సారెకు ఆలయ ధర్మకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి మహిళలు క్షీర కలశాలతో ఊరేగింపుగా దుర్గామాత ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి నామస్మరణతో పట్టణం మార్మోగింది. అభిషేకం, పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. – వి.కోట
క్షీర కలశాల ఊరేగింపు