ఎందుకో హంగామా? | - | Sakshi
Sakshi News home page

ఎందుకో హంగామా?

Sep 17 2025 8:03 AM | Updated on Sep 17 2025 8:03 AM

ఎందుక

ఎందుకో హంగామా?

నియామకమా..

మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెగబడింది. 150 రోజుల పాటు కసరత్తు జరిపి నానాహంగామా సృష్టించింది. తీరా అర్హులకు న్యాయం చేశారా.. అని చూస్తే అదీ లేదు. అనర్హులకు, అనుకూలమైన వారికి ఉద్యోగాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నియామకపత్రాల పంపిణీ పేరుతో మరో డ్రామాకు తెరలేపింది. ఈనెల 19న విజయవాడ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి దాదాపు మూడు వేల మందిని తరలించాలని టార్గెట్‌ విధించింది. దీనిపై పలువురు మండిపడుతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు వ్యాప్తంగా నిర్వహించిన మెగా డీఎస్సీ కసరత్తు విమర్శలకు తావిస్తోంది. 150 రోజుల పాటు సాగదీసి అర్హులకు మొండిచేయి చూపారని పలువురు మండిపడుతున్నారు. ఈనెల 15న మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. ఈ జాబితా ప్రచురించాక వందల సంఖ్యలో హెల్ప్‌డెస్క్‌కు కాల్‌ చేశారు. చిత్తూరు డీఈవో కార్యాలయానికి పరుగులు పెట్టారు. న్యాయం చేయండి మహాప్రభో అంటూ అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. అయితే అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేని దుస్థితిలో మిగిలిపోయారు.

డీఎస్సీ పేరుకే తిలోదకాలు

గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం డీఎస్సీ (డిస్టిక్‌ సెలెక్షన్‌ కమిటీ) పేరుకు తిలోదకాలు వదిలింది. నిబంధనల ప్రకారం డీఎస్సీ కసరత్తు మొత్తం ఎన్నో ఏళ్లుగా జిల్లా స్థాయిలోనే జరిగేది. అయితే ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించారు. ఈ కసరత్తులో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత మెరిట్‌, రోస్టర్‌ ప్రకారం విడుదల చేయాల్సిన ఎంపిక జాబితా ఆఖర్లో గందరగోళం సృష్టించారు. ఎంపిక జాబితా పేరుతో ఐదు సార్లు ప్రచురించి, కాల్‌లెటర్లు పంపి, సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా తుది జాబితా ప్రచురించే సమయానికి ఎక్కువ ర్యాంక్‌లు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు, తక్కువ ర్యాంక్‌లు వచ్చిన అభ్యర్థులను అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో వందలాది మంది అభ్యర్థులు నష్టపోయారు.

న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం

డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు న్యాయస్థానంలో 104 కేసులను వేశారని రాష్ట్ర విద్యాశాఖ అధికారుల అధికారిక సమాచారం.

ప్రచార ఆర్భాటం

మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు అందజేసే నియామకపత్రాల పంపిణీ కసరత్తును కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచార ంగా మలుచుకుంది. ఈ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 వేల మందిని విజయవాడకు పంపాలంటూ టార్గెట్‌ విధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టార్గెట్‌ విధించడంతో విద్యాశాఖ అధికారు లు తలలు పట్టుకుంటున్నారు. ఎంపికై న అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులను కూడా విజయవాడకు తీసుకురావాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపుతున్నారు. ఈ ప్రక్రియ తిరుపతి డీఈవో కేవీఎన్‌.కుమార్‌ పర్యవేక్షణలో సాగుతోంది. ఇందుకు ప్రత్యే కంగా 70 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వేలాది మంది అభ్యర్థులు మెగా డీఎస్సీలో నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని పలువురు మండిపడుతున్నారు.

డీఎస్సీ నియామకపత్రాల పంపిణీ 19వ తేదీన

నోటిఫైడ్‌ పోస్టులు 1,478

ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు 1,408

విజయవాడ తరలింపుకు విధించిన టార్గెట్‌ 3వేల మంది

ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ బస్సులు 70

ప్రయాణం చేయాల్సిన దూరం – తిరుపతి – విజయవాడ 418 కి.మీ

ఎందుకో హంగామా? 1
1/1

ఎందుకో హంగామా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement