
క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి
మాట్లాడుతున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప
ఏటవాకిలి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డి, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు: క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయనున్నట్టు మాజీ ఎంపి రెడ్డెప్ప స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీలోని 10వ వార్డులో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కన్వీనర్ వజ్రభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగ భూషణంతో కలిసి వార్డు స్థాయి విస్తృత సమావేశాలు నిర్వ హించారు. అలాగే మండలంలోని ఏటవాకిలి గ్రామంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డి, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ నిర్మాణ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు, గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటు, విధివిధానాలు, ప్రజల భాగస్వామ్యంతో యువత, మహిళలు, రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కల్పించాల్సిన ప్రాతినిధ్యంపై చర్చించారు. రెడ్డెప్ప మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. కమిటీ సభ్యులతో నేరుగా పెద్దిరెడ్డి మాట్లాడే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశాల్లో పట్టణ, రూరల్ అధ్యక్షులు ఇర్ఫాన్, అమరనాథరెడ్డి, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి పాల్గొన్నారు.

క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి