
చిత్తూరులో వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో మంగళవారం దేవరాజులు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన దేవరాజులు ఓ ప్రైవేటు కంపెనీలో బస్సు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తొమ్మిదేళ్లుగా ఇతను భార్యాబిడ్డలకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళతో చనువు ఏర్పడడంతో ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల దేవరాజులు భార్య, పిల్లలు తరచూ అతని వద్దకు వస్తూ వెళుతున్నారు. దీంతో కుటుంబంలో కలహాలు రేగాయి. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసుకొని ఇంటి పైకప్పుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమల క్యూకాంప్లెక్స్‌లో 01 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 77,043 మంది స్వామివారిని దర్శించుకోగా 41,859 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.53 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
వెల్డింగ్ కార్మికుడి మృతి
రొంపిచెర్ల: స్టోన్ క్రషర్ వద్ద వెల్డింగ్ కార్మికుడు మృతి చెందినట్లు కల్లూరు సీఐ జయ రాం నాయక్ తెలిపా రు. సీఐ కథనం.. రొంపిచెర్ల మండలం, బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ, పులిచెర్ల రోడ్డులోని బాలాజీ స్టోన్ క్రషర్‌లో కర్ణాటక రాష్ట్రం, చిక్కమంగళూరులోని కడూర్‌కు చెందిన షెక్ రసూల్ (49) వెల్డింగ్ పనికోసం రెండు రోజు క్రితం వచ్చాడు. మంగళవారం క్రషర్‌లో పనిచేస్తు సమయంలో గట్టిగా కేక వేసి కింద పడ్డాడు. సమీపంలోని మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు వచ్చి రసూల్‌ను లేపారు. అయితే రసూల్‌లో చలనం లేదు. చికిత్స కోసం అన్నమ్మయ్య జిల్లా, పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే రసూల్ మృతి చెందినట్టు నిర్ధారించారు. రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్లూరు సీఐ జయరాంనాయక్, ఎస్‌ఐ సుబ్బారెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుమత్ షాక్‌తో మృతి చెందారా? పై నుంచి కింద పడి మృతి చెందారా..? అనేది పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది.