
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న పత్రికలపైన, పత్రికా విలేకరులపై ఈ మధ్య కాలంలో అనేక కేసులు బనాయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పత్రికల ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తున్న జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపి దాడులు చేయడం అన్యాయం. అక్రమ కేసులు బనాయించడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్య్రాన్ని కాలరాయడం కరెక్టు కాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
– శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి