మాయాజాలం! | - | Sakshi
Sakshi News home page

మాయాజాలం!

Sep 16 2025 7:37 AM | Updated on Sep 16 2025 7:37 AM

మాయాజాలం!

మాయాజాలం!

చాలా కళాశాలల్లో ఎప్పటికప్పుడు నమోదుకాని విద్యార్థుల వివరాలు

తనిఖీ చేయడమే మరిచిపోయిన

ఇంటర్మీడియెట్‌ అధికారులు

ఇదే అదునుగా పలు అక్రమాలకు

తెరలేపుతున్న యాజమాన్యాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రయివేటు జూనియర్‌ కళాశాలలు అడ్మిషన్ల రిజిస్టర్లలో మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఒక కళాశాలలో చదివితే మరో కళాశాల నుంచి టీసీలిచ్చి పంపేస్తున్నాయి. అవగాహన లేక చాలా మంది మోసపోతున్నారు. ఉన్నత విద్యనభ్యసించాక స్టడీ కోసం వెళ్తే అసలు విషయం బయటపడుతోంది. ఇలాంటి కంత్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

విద్యార్థుల భవిష్యత్‌ నాశనం

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 64 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌ బోర్డు నియమ, నిబంధనలను అమలు చేయాల్సి ఉండగా.. అక్రమాలకు తెరలేపుతున్నాయి. ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్లిపోతోంది.

తనిఖీల్లో అలసత్వం

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతో పాటు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ రిజిస్టర్‌ల నిర్వహణ గందరగోళంగా ఉంది. అలసత్వంతో పాటు అడ్మిషన్‌ రిజిస్టర్‌లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక్కో విద్యార్థి పేరును అడ్మిషన్‌ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలంటే రెండేళ్లకు గాను రూ.20 వేల వరకు గుంజుతున్నారు. ఉదాహరణకు చిత్తూరు నగరంలోని మురుగానపల్లిలో ఉండే ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు 20 మందిని ఉత్తమ ర్యాంకుల కోసం జీడీ నెల్లూరులో ఉండే ఓ ప్రైవేట్‌ కళాశాలలో అడ్మిషన్‌ రిజిస్టర్‌లో పేర్లు రాయించారు. ఆ తర్వాత అక్కడే చదువుతున్నట్లు క్రియేట్‌ చేశారు. అక్కడ పేర్లను నమోదు చేసిన ఒక్కొక్క విద్యార్థికి రూ.20 వేల చొప్పున మొత్తం 20 మంది విద్యార్థులకు గాను రూ.4 లక్షలను మురుగానపల్లి కళాశాల నిర్వాహకులు జీడీ నెల్లూరు కళాశాల యాజమాన్యానికి చెల్లిస్తున్నారు.

పరిమితికి మించి విద్యార్థులు ఉండడంతో!

జిల్లాలోని పలు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఇంటర్మీడియెట్‌ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. పరిమితికి మించి విద్యార్థులను అడ్మిషన్లు చేసుకుంటున్నారు. అలా అధికంగా అడ్మిషన్‌లు చేసుకున్న విద్యార్థుల వివరాలను నిబంధనల ప్రకారం అడ్మిషన్‌ రిజిస్టర్‌లో నమోదు చేసేందుకు అవకాశం లేదు. నిర్ధేశించి గ్రూపునకు 88 మంది విద్యార్థులను మాత్రమే అడ్మిషన్‌ చేసుకోవాలి. అయితే జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో 300 మంది విద్యార్థుల వరకు ఒక్కొక్క గ్రూపులో అడ్మిషన్‌లు చేసుకుంటున్నారు. ఇలా అధికంగా ఉన్న విద్యార్థులను మరొక కళాశాలలోని అడ్మిషన్‌ రిజిస్టర్‌లలో అడ్మిషన్‌లు అయినట్టు రాయించి మోసాలకు పాల్పడుతున్నారు.

ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు 64

విద్యార్థుల సంఖ్య 75,897

అడ్మిషన్‌ రిజిస్టర్ల నిర్వహణలో

లోపాలున్న కళాశాలలు 52

పక్కాగా అడ్మిషన్‌ రిజిస్టర్లు అమలు చేస్తున్న ప్రభుత్వ కళాశాలలు 31

అక్రమాలకు పాల్పడుతున్న

ప్రైవేట్‌ కళాశాలలు 36

మోసాలకు అడ్డూ అదుపే లేదు

జిల్లాలోని అనేక ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ రిజిస్టర్లను సరిగా నిర్వహించడమే లేదు. ఈ విషయం ఇంటర్మీడియెట్‌ అధికారులకు సైతం తెలుసు. ఆ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. కొన్ని కళాశాలల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేర్చుకుని నిబంధనలకు విరుద్ధంగా మరొక కళాశాలలో చదివినట్లుగా అడ్మిషన్‌ రిజిస్టర్‌లో పేర్లు రాయిస్తున్నారు. ఇలాంటి అవకతవకలు చాలా ప్రైవేట్‌ కళాశాలల్లో జరుగుతున్నాయి. తనిఖీలు చేయాల్సిన ఇంటర్మీడియెట్‌ అధికారులు అటు వైపు కన్నెత్తే చూడటం లేదు.

– షేక్‌ రెడ్డిమస్తాన్‌, స్టూడెంట్‌ యూనియన్‌ జేఏసీ వైస్‌ చైర్మన్‌, చిత్తూరు జిల్లా

జిల్లా సమాచారం

ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో

కానరాని అడ్మిషన్‌ రిజిస్టర్లు

.. ఇది ఒక్క వినయ్‌ పరిస్థితే కాదు.. జిల్లాలోని చాలా ప్రయివేటు కళాశాలల్లో ఇదే తంతు. పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరిలో ఉన్న పలు ప్రైవేట్‌ కళాశాలల్లో మాయాజాలం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు అడ్మిషన్‌ రిజిస్టర్లను తనిఖీ చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement