
శోధించి..ఛేదించారు!
భారీ చోరీ గుట్టువిప్పిన పలమనేరు పోలీసులు 540 గ్రాముల బంగారు నగలు, 336 గ్రాముల వెండి స్వాధీనం నిందితుడి అరెస్ట్
పలమనేరు: పక్కాగా రెక్కీచేసి తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలు చేస్తున్న దొంగను పలమనేరు పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ స్థానిక సీఐ కార్యాలయంలో సోమవారం మీడియాకు తెలిపారు.
పక్కాప్లాన్‌తో..!
పలమనేరులోని రాధాబంగ్లాలో టీడీపీ నాయకుడు సాకేవూరు రామూర్తినాయుడి ఇల్లు చుట్టుపక్కల గృహాలు లేకుండా ఉంది. ఈ ఇంటికి తరచూ లాక్ చేసుండడాన్ని దొంగ గమనించి పక్కాస్కెచ్ వేశాడు. గత నెల 31న ఇంట్లో ఎవరూలేనిది గమనించి సాయత్రం ఐదు గంటలకే ఇంట్లోకి వెళ్లాడు. ఎలాంటి సమస్యా లేకుండా చోరీ చేశాడు. దీనిపై బాధితుడు స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లాలోని క్రైమ్ పార్టీల ద్వారా విచారణ ముమ్మరం చేశారు.
టెక్నికల్‌గా దొంగను పట్టుకున్నారు!
ఎట్టకేలకు జిల్లా, డివిజన్, స్థానిక క్రైమ్‌పార్టీ నిందితున్ని సోమవారం పట్టణ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాకినాడకు చెందిన ఆడపాల వెంకట శివ(32)గా తెలిపారు. అతని వద్ద నుంచి చోరీకి సంబంధించిన మొత్తం రికవరీ చేశామన్నారు.
తగ్గేదే లే!
ఈ కేసులో పలమనేరు పోలీసులు పట్టుకున్న శివాపై ఇప్పటిదాకా ఏపీలో 12 కేసులున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాకినాడకు చెందిన శివ డిగ్రీ పూర్తిచేసి ఈజీ సంపాదన కోసం చోరీలకి తెగబడ్డాడు. ఆపై హైదరాబాద్‌లో సినీపరిశ్రమలో కొన్నాళ్లుండి ఆపై మళ్లీ కొత్త నేరాలకు దిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు చాలెంజ్‌గా తీసుకున్న డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ మురళీమోహన్, క్రైమ్ సీఐ ఉమామహేశ్వర్, ఏఎస్‌ఐ దేవా పలమనేరు సమీపంలోని ఆంజినేయ స్వామి ఆలయం వద్ద నిందితున్ని సోమవారం పట్టుకున్నట్టు తెలిపారు. నిందితున్ని కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. ఇందులో సీఐ మురళీమోహన్, క్రైమ్ సీఐ ఉమామహేశ్వర్ ఉన్నారు.