
పూలంగి సేవ
– 8లో
కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యే క బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పూలంగి సేవ నిర్వహించారు.
సామాన్యుల సమస్యలకే ప్రాధాన్యం
చిత్తూరు అర్బన్: సామన్యుల సమస్యలను తీర్చడానికే పోలీసుశాఖ పనిచేస్తుందని తుషార్ డూడి అన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా బాపట్లలో పనిచేస్తున్న ఈయన చిత్తూరులో సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. డూడి తన తల్లి సమక్షంలో చిత్తూరు 68వ ఎస్పీగా విధుల్లోకి చేరారు. పోలీసు అధికారులు స్వాగతం పలకగా.. మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. అనంతరం డూడి మాట్లాడుతూ మహిళలు, పిల్లల సంరక్షణతో పాటు.. సామాన్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. రౌడీయిజాన్ని ఉపేక్షించేది లేదన్నారు. జిల్లాలోని పోలీసుల్లో వృత్తి నైపుణ్యత పెంచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు. ప్రజలకు పోలీసుశాఖపై నమ్మకం పెరిగేలా.. ప్రజలకు చేరువయ్యి కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తామన్నారు. జిల్లా ప్రజానీకానికి శాంతిభద్రతల సమస్య రాకుండా ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పిస్తామన్నారు.
సబ్–డివిజన్ల వారీగా సమీక్ష..
బాధ్యతలు తీసుకున్న తరువాత డూడి జిల్లాలోని సబ్–డివిజన్ల వారీగా డీఎస్పీలు, సీఐలతో సమీక్ష నిర్వహించారు. ఆయా సర్కిళ్లల్లో ప్రధాన సమస్యలు, నేరాల తీరుతెన్నును ఇన్‌స్పెక్టర్లు వివరించారు. సీఎంతో ఎస్పీల సమావేశం ఉండడంతో ఆయన విజయవాడకు బయలుదేరి వెళ్లారు.