రేపటి నుంచి పాఠశాలల్లో ‘స్వచ్ఛతా పక్వాడా’ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి పాఠశాలల్లో ‘స్వచ్ఛతా పక్వాడా’

Sep 15 2025 8:15 AM | Updated on Sep 15 2025 8:15 AM

రేపటి నుంచి పాఠశాలల్లో ‘స్వచ్ఛతా పక్వాడా’

రేపటి నుంచి పాఠశాలల్లో ‘స్వచ్ఛతా పక్వాడా’

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 16వ తేదీ నుంచి ఈనెల 30 వరకు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆ కార్యక్రమం షెడ్యూల్‌, విధి విధానాలకు డీఈవో కార్యాలయానికి పంపారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలో పకడ్బందీగా స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కార్యక్రమంలో నిర్వహించే ఫొటోలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు.

షెడ్యూల్‌ ఇలా......

ఈనెల 16న స్వచ్ఛత ప్రతిజ్ఙ , 17న నీటి పారిశుధ్య సదుపాయాల తనిఖీ, మరమ్మతులకు ప్రణాళికలు, 18న పేరెంట్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ సమావేశాలు, 19న పాఠశాల పరిసరాల శుభ్రతపై దృష్టి, 20న వ్యాసరచన పోటీలు (స్వచ్ఛత అంశంపై), 21న పెయింటింగ్‌, మోడల్‌ మేకింగ్‌ పోటీలు , 22న క్విజ్‌ పోటీలు, 23న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధ దినం, 24న పాడైన వస్తువులు, పాత ఫర్నిచర్‌ మొదలైన చెత్తను తొలగించడం, 25న పాఠశాలల్లో మొక్క లు నాటడం, 26న చేతులు శుభ్రం చేసుకునే విధానంపై అవగాహన, 27న విద్యార్థులు, టీచ ర్లు స్థానిక ప్రజలకు స్వచ్ఛత అవగాహన కార్యక్రమం, 28న శుభ్రపరిచే ప్రత్యేక డ్రైవ్‌, 29న స్వచ్ఛ త అవగాహన ర్యాలీలు, 30న స్వచ్ఛత ప్రదర్శన, ఉత్తమ పాఠశాలలకు బహుమతులు మొత్తం కార్యక్రమాల సమీక్ష, నివేదిక అంద జేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

నేడు ఎస్పీ తుషార్‌ డూడి బాధ్యతల స్వీకరణ

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నూతన ఎస్పీగా నియమితులైన తుషార్‌ డూడి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. బాపట్ల ఎస్పీగా పనిచేస్తున్న ఆయన చిత్తూరుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకోసం జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.

డీసీసీబీలో

అడ్డగోలుగా విచారణ !

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు నేతలు డీసీసీబీపై కన్ను పెట్టారు. కక్ష పూరితంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్న పాలకవర్గంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కోట్లల్లో అవినీతి, అక్రమాలంటూ కట్టుకథలు అల్లుతున్నారు. ప్రజలను, డీసీసీబీ రుణదారులను ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే విచారణ పేరుతో రుణాల మంజూరులో భారీగా బోగస్‌ జరిగిందని తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ప్రస్తుతం సెక్షన్‌ 51 కింద విచారణ జరుగుతోంది. ఇంతలోనే అధికారులు సస్పెండ్‌ అంటూ కొందరు అధికారులు, సిబ్బంది పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు. శాఖలో 11 మంది ఉద్యోగుల సస్పెన్షన్‌ 30 మందిపై చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీనిపై పెద్ద కుట్రే దాగుందని డీసీసీబీ రుణదారులు మండిపడుతున్నారు. ఇదంతా కక్ష పూరితమేనని వారు వాదిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన లోటును భర్తీ చేసి... గత ఐదేళ్లల్లో డీసీసీబీ లాభాల్లో పయనించేలా చేశారని రుణాదారులు గుర్తు చేస్తున్నారు. చిన్న తప్పిదాలను బూతద్దంలో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారని, అలాగే గత పాలకవర్గానికి కొందరు అధికారులు, సిబ్బంది అంటకాగారని..టార్గెట్‌ చేసి ఈ కుట్రకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement