
భయంకరి
కౌండిన్య నుంచి పట్టణ ఆవాసాల్లోకి చొరబడిన వైనం ఏనుగు దాడిలో ఎఫ్‌ఎస్వోకు, మావటికి తీవ్రగాయాలు ట్రాకర్స్ దారిమళ్లించే క్రమంలో ఎదురుదాడి ఎట్టకేలకు గంటావూరు వద్ద అడవిలోకి వెళ్లిన ఏనుగు ఊపిరి పీల్చుకున్న ఫారెస్ట్ అధికారులు
పలమనేరులో ఓ మదపుటేనుగు హల్‌చల్ చేసింది. అడవిలోంచి ఒంటరిగా జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించింది. దాన్ని చూసి జనం కేకలు వేయడంతో మరింత చిర్రెత్తిపోయింది. దాదాపు ఆరు గంటలపాటు రోడ్లపై స్వైరవిహారం చేసింది. అడ్డొచ్చిన వారిపై ఎదురుదాడికి దిగింది. బుల్లెట్‌పై వచ్చిన ఎఫ్‌ఎస్వో సుకుమార్‌పై దాడికి తెగబడింది. తనదారికి అడ్డొచ్చిన వాహనాలను ఎత్తిపడేసింది. ఓ లేగదూడపైన ఉరిమింది. అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నించిన ట్రాకర్‌పై దాడి చేసి.. ఆ తర్వాత అడవిలోకి వెళ్లింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పలమనేరు: కౌండిన్య ఎలిఫెండ్ శాంచురీ సమీపంలోని అడ విలోంచి ఓ ఒంటరి ఏనుగు శనివారం ఉదయం పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డు సమీపంలోకి వచ్చింది. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న వారు గమనించి స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్‌ఎస్వో సుకుమార్ తన సిబ్బంది ట్రాకర్స్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాణసంచా పేలుస్తూ ట్రాకర్స్ ఏనుగును మళ్లించే ప్రయత్నం చేశారు. దీంతోపాటు స్థానికుల అరుపులు, కేకలు, సెల్‌ఫోన్లలో వీడియోలు తీయడం లాంటివి చేశారు. ఆగ్రహించిన ఏనుగు జనంపైకి ఎదరుదాడికి దిగింది. ఇదే సయంలో పాత కీలపట్ల రోడ్డు వద్ద బుల్లెట్‌పై వచ్చిన ఎఫ్‌ఎస్వో సుకుమార్ పైకి దాడికి పాల్పడింది. ఆయన తప్పించుకునే ప్రయత్నంలో బైక్‌ను ఆపి పరుగెత్తబోయి కిందపడ్డాడు. ఆ ఏనుగు అతనిపై పడి నలిపేసింది. జనం గట్టిగా అరుపులు పెట్టగా ట్రాకర్లు నాగరాజు తదితరులు రాళ్లతో ఏనుగుపై దాడి చేశారు. దీంతో అది అక్కడి నుంచి పక్కకెళ్లింది. 108 సమయానికి రాకపోవడంతో ఫారెస్ట్ వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఏనుగు దాడిలో సుకుమార్‌కు కాలు, చేయికి
తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ప్రథమ చికిత్సలనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.
ఆరు గంటలపాటు హల్‌చల్
ప్రజల అరుపులు, అలజడితో ఏనుగు ఘీకాంరాలు చేస్తూ ఎటు వెళ్లాలో తెలియక రాఘవేంద్రస్వామి ఆలయం, చిన్నూరు, బైపాస్‌రోడ్డు, గంటావూరు, బెంగళూరు– చైన్నె హైవే బైపాస్ తదితర ప్రాంతాల్లో హల్‌చల్ చేసింది. హైవేలో ఏనుగు వెళుతున్నప్పుడు వందలాది మంది రోడ్డుపక్కన గుమిగూడారు. ఏనుగు కారణంగా బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ ఆగిపోయింది. ఏనుగును చూసేందుకు జనం రోడ్డుపై ఆగిన వాహనాలపై ఎక్కి గోల చేశారు. దీంతో మరింత భయపడిన ఏనుగు గంటావూరు వద్ద టెర్రకోట దుకాభాల మధ్య రోడ్డుపై వెళుతూ రోడ్డు పక్కన పార్క్ చేసిన పలు కార్లను పైకెత్తేందుకు ప్రయత్నించింది. అక్కడికి వచ్చిన ఫారెస్ట్ జీపుపై దాడికి రాగా డ్రైవర్ చాకచక్యంగా జీపును రివర్స్‌చేసి వెళ్లిపోయాడు.
ఎఫ్‌ఆర్వో సుకుమార్‌పై దాడి చేస్తున్న ఏనుగు
పలమనేరు పట్టణంలో సంచరిస్తున్న మదపుటేనుగు
పలమనేరులో ఒంటరి ఏనుగు స్వైరవిహారం

భయంకరి

భయంకరి