
కుంకీలతో బిల్డప్
పలమనేరు: పలమనేరు పట్టణంలో శనివారం హల్‌చల్ చేసిన మదపుటేనుగు విషయం సామాజిక మాధ్యమాల్లో భారీగా ప్రచారమైంది. ఈ నేపథ్యంలో కుంకీలతో మదపుటేనుగును ఎందుకు అదుపు చేయలేదనే మాటలు వినిపించాయి. డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక ఫారెస్ట్ అధికారులు శనివారం రాత్రి మదపుటేనుగు అడవిలోకి వెళ్లిన చోటుకు రెండు కుంకీ ఏనుగులను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సబ్ డీఎఫ్‌ఓ వేణుగోపాల్ మాట్లాడుతూ మళ్లీ మదపుటేనుగు ఇక్కడికి రావచ్చనే అనుమానంతో రెండు కుంకీలను తెచ్చామన్నారు. అయితే పట్టణ వాసులు ఎవ్వరూ ఇలాంటి చోటుకు రాకూడదని హెచ్చరించారు. ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఏదో చేస్తున్నామనే మాట నిలబెట్టుకోవడానికే ఈ నాటకాన్ని చేస్తోందని స్థానికులు గుసగుసలాడడం గమనార్హం.