
కలానికి సంకెళ్లా?
సమాజంలో జరిగే అన్యాయాలను వెలుగుచూపడంలో పత్రిక కీలకంగా పనిచేస్తోంది. నిర్భయంగా అన్యాయాలను పత్రికల ద్వారా వెలుగులోకి తేవడం పాత్రికేయుల విధి. నిజాన్ని నిర్భయంగా పత్రికలు ప్రచురించడంలో తప్పులేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికలపై దాడులు ఎక్కువయ్యాయి. ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తోంది. చిన్నచిన్న వార్తాలు ప్రచురితమైతే కూడా కేసులు పెట్టిస్తోంది. ఇలా కలానికి సంకెళ్లు వేయడం కరెక్టు కాదు. విచారణ పేరుతో పోలీసులు వేధించడం తగదు. పోలీసులు కూడా వాస్తవాలను తెలుసుకోవాలి. ప్రభుత్వ తప్పిదాలను బయట పెడితే పగబడుతోంది. ఇందుకు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయం మరిచిపోతే ఎలా?
–సునీల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, పూతలపట్టు