
విద్యారంగాన్ని కాపాడుకుందాం
చిత్తూరు కలెక్టరేట్ : సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందామని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటామోహన్ అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో ఇటీవల జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన టీచర్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర, జిల్లా స్థాయిలో పురస్కారాలు పొందిన నౌషాద్ అలీ, గోపీనాథ్‌రెడ్డి, కమలాపతి, సుబ్రహ్మణ్యం, మీనాక్షి, రాధాకుమారి, ప్రసన్నకుమారి, రామకృష్ణ, ఆనందయ్య తదితరులను దుశ్శాలువతో సత్కరించి అభినందించారు.