
రాజీ మార్గమే రాచమార్గం!
చిత్తూరు లీగల్/అర్బన్: కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమైన మార్గమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జాతీయ లోక్‌అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్‌ల ద్వారా పరిష్కరిస్తూ.. కక్షిదారులకు సత్వర న్యాయం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, న్యాయమూర్తులు శ్రీనివాసరావు, శ్రీదేవి, శిరీషా, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎనిమిదో స్థానం
చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అదాలత్‌లో 5,345 కేసులను పరిష్కరించి రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. ఇందులో చిత్తూరులో 1,652 కేసులు, తిరుపతిలో 1,488, వాయల్పాడు 82, తంబళ్లపల్లె 186, శ్రీకాళహస్తి 245, సత్యవేడు 308, పుత్తూరు 214, పుంగనూరు 139, పీలేరు 78, పలమనేరు 245, పాకాల 94, నగరి 104, మదనపల్లె 695, కుప్పంలో 84 కేసులు పరిష్కరించారు.