
ఆఫీసు సబార్డినేటర్ల సంఘం ఏకగ్రీవం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా వాణిజ్య పన్నులశాఖ ఆఫీసు సబార్డినేటర్ ఉద్యోగుల సంఘాన్ని ఏకగ్రీవంగా ఏన్నుకున్నారు. శనివారం జిల్లా వాణిజ్య పన్నులశాఖ జేసీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం మాట్లాడారు. ఏడు పదవులకు గాను అదే సంఖ్యలో నామినేషన్ రావడంతో సంఘం ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నమన్నారు. ఎన్నికల అధికారిగా బీ.గోపాలకృష్ణయ్య, సహాయ ఎన్నికల అధికారిగా కే.చెన్నకేశవులు వ్యవహరించారన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.మనోహరనాయక్, ఉపాధ్యక్షులుగా తిప్పన్నా, పి.సుదర్శన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.మునికృష్ణయ్య, కార్యాలయ కార్యదర్శిగా సి.రవి, సంయుక్త కార్యదర్శిగా కె.భరత్, జిల్లా కోశాధికారిగా డి. షఫీను ప్రకటించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు వివరించారు. మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.