చిత్తూరు కార్పొరేషన్: ఉద్యోగులు ఐక్యంగా ఉండాలని విద్యుత్‌శాఖ విశ్రాంత ఉద్యోగుల సంఘం డిస్కం కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. శనివారం సంఘం 5వ వార్షికోత్సం సందర్భంగా చిత్తూరులోని ఆశాఖ అతిథిగృహంలో సమావేశం నిర్వహించారు. ఉద్యోగ రీత్యా అందరూ కలిసి పనిచేసిన రోజులు గుర్తు చేశారు. అనంతరం 70 ఏళ్లు దాటిన విశ్రాంత ఉద్యోగులు మురళి, రమణమూర్తి, సుబ్రమణ్యంశెట్టి, మోహనపిళ్‌లై, గంగమ్మనాయుడు, ఏకాంబరం, రెడ్డెప్పనాయుడు, చంద్రబాబు, రంగయ్యనాయుడు, శివన్‌కుట్టి, ప్రకాష్, సుబ్రమణ్యంశెట్టి, గుణశేఖర్, రామచంద్రన్, అబ్దుల్‌సలాం, రాజామందడి, ముత్తు, మారిముత్తు, పార్థసారథి, జయపాల్, సూర్యబాబు, చెంగల్రాయశెట్టి, శ్రీరాములకు జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. సంఘం డివిజన్ కార్యదర్శి మునిరత్నంశెట్టి, నాయకులు ప్రకాష్, వేణుగోపాల్‌అయ్యర్, ప్రభావతి, మురళి, మోహన్‌రాజ్, మునిరత్నంశెట్టి, బాబునాయుడు పాల్గొన్నారు.