
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 29 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 29 మందికి రూ.2.9 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్‌పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి శనివారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం సేవించి నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 29 మందిపై కేసు నమోదుచేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.2.9 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఇంత చిన్నచూపా?
పలమనేరు: సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మురళీనాథ్ శనివా రం ఆవేదన వ్యక్తం చేశారు. తమను వలంటీర్లుగా మార్చేశారన్నారు. రకరకాల సర్వేలు, ఇంటింటికీ వెళ్లి మ్యాపింగ్‌లు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వలంటీర్లు 50 కుటుంబాలకు చేస్తున్న సేవలను సైతం తమవద్దే చేయిస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ రేష న్ కార్డుల పంపిణీని సైతం తమ వద్ద చేయించడం సమంజసం కాదన్నారు.