
పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర అవార్డు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వేలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసినందుకు అధ్యాపకులు శరత్‌చంద్రశేఖర్‌కు రాష్ట్ర ఉత్తమ అవార్డు దక్కిందని రిటైర్డ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో శనివారం రాష్ట్ర అవార్డు గ్రహీత శరత్‌చంద్రశేఖర్‌కు అభినందన సభ నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ హెడ్‌మాస్టర్ వీరరాఘవనాయుడు మాట్లాడుతూ శరత్‌చంద్రశేఖర్ పనిచేసిన కళాశాలల్లో విద్యార్థుల అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు.