
కళాశాలలు ఎలా నిర్వహించాలి?
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్‌టీఎఫ్ (రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ) నిధులు విడుదల చేయకపోతే కళాశాలలు ఎలా నిర్వహించాలని ఎస్‌వీయూ అసోసియేషన్ ఈసీ మెంబర్ హేమచంద్రనాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు చెల్లించాల్సిన ఆర్‌టీఎఫ్ నిధుల మంజూరుకు ఆందోళనలు చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏపీప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్నం సురేంద్రరెడ్డి మాట్లాడుతూ ఈనెల 20లోపు విడుదల చేయాల్సిన పెండింగ్ నిధులను మంజూరు చేయాలని, లేని పక్షంలో ఈనెల 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించారు.