అక్రమాలకు పాల్పడితే.. ‘బుక్‌’అయిపోతారు! | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు పాల్పడితే.. ‘బుక్‌’అయిపోతారు!

Sep 10 2025 3:51 AM | Updated on Sep 10 2025 3:51 AM

అక్రమ

అక్రమాలకు పాల్పడితే.. ‘బుక్‌’అయిపోతారు!

● పొదుపు సంఘాల్లో పలు అక్రమాలు ● ప్రత్యేక యాప్‌తో అడ్డుకట్టకు చర్యలు ● యాప్‌లో నమోదైన అనంతరం, స్వయం సహాయక సంఘానికి, సభ్యులకు కేటాయించిన ప్రత్యేక ఐడీల ద్వారా ఆర్థిక లావాదేవీలు సులువుగా తెలుసుకోవచ్చు ● ప్రతి నెలా పొదుపు, రుణ చెల్లింపుల నిమిత్తం వెలుగు సిబ్బందికి ఇచ్చిన నగదు బ్యాంకులో జమచేశారా? లేదా ? అనే వివరాలను తెలుసుకునే వెసులుబాటు. సంక్షిప్త సందేశంతో సహా వాయిస్‌ మెసేజ్‌ను సైతం పొందవచ్చు.

జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు

నియోజకవర్గం గ్రూపుల సంఖ్య

చిత్తూరు 500

గంగాధరనెల్లూరు 1,881

కుప్పం 2,171

నగరి 1,404

పలమనేరు 2,475

పుంగనూరు 1,791

పూతలపట్టు 2,316

మొత్తం 11,538

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని పొదుపు సంఘాల్లో నిత్యం ఏదో ఒక చోట అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పొదుపు సంఘాలు అక్రమాలకు పాల్పడి నగదు కొట్టేస్తున్న ఘటనలు తలెత్తుతున్నాయి. ఇలా అక్రమాలకు పాల్పడే పొదుపు సంఘాలపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అటువంటి పొదుపు సంఘాల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, స్వయం సహాయక సంఘాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. మొబైల్‌ బుక్‌ కీపింగ్‌ యాప్‌ (మన డబ్బులు–మన లెక్కలు) పేరుతో యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను డీఆర్‌డీఏ శాఖ జిల్లాలోని పొదుపు సంఘాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

మొదటి నుంచి పుస్తకాల్లోనే వివరాలు

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు పొదుపులో చేరినప్పటి నుంచి పుస్తకాల్లోనే వివరాలను నమోదు చేస్తున్నారు. ఇకపై అలాంటి పద్ధతికి అవకాశం లేకుండా యాప్‌లో నగదు లావాదేవీలన్నీ నమోదు చేసేలా అవకాశం కల్పించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్‌లో సభ్యులు పొదుపులో చేరినప్పటి నుంచి పుస్తకాల్లో నమోదు చేసిన సమగ్ర వివరాలను నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నారు.

ప్రయోజనాలు ఇలా..!

పొదుపు సంఘాలకు ప్రత్యేక యాప్‌ చిత్రం, పొదుపు సంఘాల గ్రూపు నిర్వహణ

అభ్యంతరాలకు అవకాశం

ఈ ఏడాది మార్చి 31 వరకు సంఘాలు, వాటిలోని సభ్యుల పొ దుపు, బ్యాంకుల నుంచి పొంది న రుణాలు, సీ్త్రనిధి, ఉన్నతి వివరాలన్నీ యాప్‌లోనే నమోదు చేస్తారు. వాటి ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలు సైతం యాప్‌లో కనిపిస్తాయి. ఇందులో ఏవైనా అ భ్యంతరాలుంటే యాప్‌లోనే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. – శ్రీదేవి, డీఆర్‌డీఏ పీడీ, చిత్తూరు జిల్లా

అక్రమాలకు పాల్పడితే.. ‘బుక్‌’అయిపోతారు! 1
1/2

అక్రమాలకు పాల్పడితే.. ‘బుక్‌’అయిపోతారు!

అక్రమాలకు పాల్పడితే.. ‘బుక్‌’అయిపోతారు! 2
2/2

అక్రమాలకు పాల్పడితే.. ‘బుక్‌’అయిపోతారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement