
డిగ్రీ కళాశాలలు మూకుమ్మడిగా మూసివేస్తాం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మూకుమ్మడిగా మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ ప్రైవే ట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం అసో సియేషన్ ఉపాధ్యక్షులు పట్నం సురేంద్రరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళ వారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామన్నారు. అయితే ఎటువంటి స్పందనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర సంవత్సరంగా కరస్పాండెంట్లు అప్పులు చేసి కళాశాలలు నిర్వహిస్తున్నారని చెప్పారు. స్కాలర్‌షిప్‌ల కోసం ప్రతి నెలా ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 2023–24, 2024–25 విద్యాసంవత్సరాల పెండింగ్ ఆర్‌టీఎఫ్ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. డిగ్రీ కోర్సు ఫీజులను సవరించి కొత్త ఫీజు విధానం ఆయా యూనివర్సిటీలకే అప్పగించాలని డిమాండ్ చేశారు.