గ్రామంలో లేని మహిళకు ఆశా కార్యకర్త పోస్టు | - | Sakshi
Sakshi News home page

గ్రామంలో లేని మహిళకు ఆశా కార్యకర్త పోస్టు

Sep 10 2025 3:51 AM | Updated on Sep 10 2025 3:51 AM

గ్రామంలో లేని మహిళకు ఆశా కార్యకర్త పోస్టు

గ్రామంలో లేని మహిళకు ఆశా కార్యకర్త పోస్టు

చౌడేపల్లె: మండలంలోని పెద్ద యల్లకుంట్ల పంచాయతీ పరిధిలో గ్రామంలోని మహిళను ఆశా కార్యకర్తగా నియమించడంపై గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులందరూ కలిసి మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యురాలు మోనాను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో ఆశ కార్యకర్తగా ఉన్న లక్ష్మీదేవి మృతిచెందడంతో ఆ పోస్టుకు ఆరుగురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. అయితే నిబంధనలు పాటించకుండా పక్క పంచాయతీలో నివాసమున్న మహిళకు పోస్టు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement