
పంచాయతీల సుస్థిర అభివృద్ధికి కృషి
పూతలపట్టు(యాదమరి): పంచాయతీల సుస్థిర అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పూతలపట్టు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నాగరాజు ఆధ్వర్యంలో పంచాయతీ పురోగతి(2.0)పై సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన వనరులను అన్వేషించాలన్నారు. పొడి, తడి చెత్తను వేరు చేసి అందులో నుంచి వర్మీకంపోస్టును తయారు చేసి, వాటిని రైతులకు విక్రయించాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఈఓపీఆర్డీ శ్రీనివాసులు