
11 నుంచి డైట్‌లో కళా ఉత్సవ పోటీలు
కార్వేటినగరం: జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో 11, 12 తేదీల్లో భారతీయ సంస్కృతి, సంప్రయాల వారసత్వ కళలపై (కళాఉత్సవ్) పోటీలు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ బీ.వరలక్ష్మి తెలిపారు. మంగళవారం డైట్ కళాశాల ఆవరణలో ఉళాఉత్సవ్ పోటీల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ నెల 11, 12 తేదీలలో 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు సంస్కృతి కళలపై కళాఉత్సవ్ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన వచ్చన్నారు. అనంతరం కళాఉత్సవ్ ఇన్‌చార్జి ఎస్.రంజిత్‌కుమార్ మాట్లాడతూ 11న గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం నృత్యం విభాగాలలో పోటీలు ఉంటాయని తెలిపారు. 12న థియేటర్స్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ సంప్రదాయ కథకథనం విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులు 10వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా 8801718082 నంబర్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డీకే దామోదర్‌రావు, మోహన్‌రెడ్డి, నాగరాజునాయక్, సూపరింటెండెంట్ కృపావతి పాల్గొన్నారు.