
‘హద్దు’లు దాటిన అక్రమాలు
తమిళనాడు సరిహద్దు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని టీడీపీ నేతల అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
ఆగని ఏనుగుల దాడి
పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లె, దిగువమూర్తివారి పల్లెలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025
బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారు
కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.
– భరత్, ఎమ్మెల్సీ, కుప్పం
ఎలాంటి ఆధారాలు లేకుండా..
లిక్కర్ కేసులో గతంలోనే సిట్ ముందు ఎంపీ మిథున్‌రెడ్డి వాస్తవాలను చెప్పారు. కానీ ఆయన పీ ఎల్‌ఆర్ కంపెనీకి ఎవరో పెట్టుబడిగా పెట్టిన రూ.5 కోట్లపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. చంద్రబాబు ఎందుకు వీరిని టార్గెట్ చేశారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. న్యాయమే గెలుస్తుంది.
– వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే పలమనేరు
ప్రశ్నిస్తుండడంతోనే అక్రమ కేసులు
ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్నామనే ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. లేని మద్యం కేసును సృష్టించి అన్యాయంగా అరెస్టులు చేయడం దారుణం. దీనికి పచ్చమూక మూల్యం చెల్లించుకోక తప్పదు.
– కృపాలక్ష్మి, సమన్వయకర్త
గంగాధరనెల్లూరు నియోజకవర్గరం
కక్షగట్టి అరెస్ట్ చేశారు
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే నెపంతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి పాలన లో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయి. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్ మె యిల్ చేసి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టుల పరంపర జరుగుతోంది. 2014–19 పాలనాకాలానికి సంబంధించి చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై 13 అవినీతి కేసులు ఉన్నాయి. ఇందులో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైంది. ఈ కేసులను నిర్వీర్యం చేసేందుకు సీఎం పదవి ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నారు.– విజయానందరెడ్డి, సమన్వయకర్త చిత్తూరు నియోజకవర్గం
లోకేష్ నీకు చిప్పకూడే గతి
కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎంపీ మిథు న్ రెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా తమ స్వార్థం కోసం వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యువగళం పాద యాత్రలో ప్రజలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన నారా లోకే ష్ పక్షాన ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గం. కూ టమి ప్రభుత్వ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది.
– వీ.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ
రాష్ట్ర ప్రచార కార్యదర్శి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘పెద్దాయన’గా పేరు ప్రతిష్టలు.. ప్రజా సేవే పరమావధిగా సేవలందించే కుటుంబసభ్యులు.. పేదలతో మమేకమై చేసే రాజకీయాలు.. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుయాయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం. దశాబ్దాలుగా ఆయన సంపాదించుకుంది జనాభిమానం. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని అంశం. అందుకే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి తనకు కొరకరాని కొయ్యగా తయారైన పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకుని కుట్రలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షగట్టి వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు తెగబడుతున్నారు. అందులో భాగంగానే నిరాధార ఆరోపణలతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు.
ఎంపీ మిథున్‌రెడ్డి కారును దహనం చేసిన దృశ్యం (ఫైల్)
నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్’
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. గ్రీవెన్స్‌కు అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీసు కార్యాలయంలో..
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ప్రజలు వారి సమస్యలను నేరుగా కలిసి చెప్పుకోవచ్చన్నారు.. ఉదయం 10.30 గంటల నుంచి వినతులు స్వీకరించి, వాటిని పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
క్రీడాభివృద్ధికి ఉద్యోగోన్నతి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్లకు ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి రావడం ఆనందంగా ఉందని పీడీ బాబు తెలిపారు. ఆదివారం పీసీఆర్ పాఠశాలలో ఈ మేరకు ఉద్యోగోన్నతి పొందిన పీడీలను ఘనంగా సత్కరించారు. బాబు మాట్లాడుతూ ఉద్యోగోన్నతులు పొందిన పీడీలు ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దారన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 మందికి ప్రమోషన్ రావడం శుభపరిణామమని వెల్లడించారు. ఏ స్థాయి విధులనైనా పీడీలు సమర్థవంతంగా నిర్వర్తించగలరని వెల్లడించారు. ఉద్యోగోన్నతి పొందిన కోమల, సురేష్, సెల్వపాండియన్, కోటేశ్వరరావు, రామ, చంద్రశేఖర్, అమర్‌నాథ్, మురళీ, దామోదరంతోపాటు పీడీలు రవీంద్రారెడ్డి, నూరుద్దీన్, సుబ్రమణ్యంరెడ్డి, సిరాజ్, దేవానంద్, గురుప్రసాద్ పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయుల
జిల్లా సంఘం ఎన్నిక
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల సంఘం ఎన్నుకున్నారు. ఆదివారం ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడిగా అరుణ్‌కుమార్ (జెడ్పీ, ఏఎల్‌పురం), ప్రధాన కార్యదర్శిగా సురేష్ (జెడ్పీ, పోలవరం), కోశాధికారిగా బాలచైతన్య (జెడ్పీ కల్లుపల్లె), గౌరవాధ్యక్షుడిగా భాస్కరరావు, రాష్ట్ర కౌన్సిలర్లుగా గిరిరాజా (జెడ్పీ, టేకుమంద), రమేష్ (జెడ్పీ, బీఎన్‌ఆర్‌పేట), నాగేశ్వరరావు (జెడ్పీ, పైపాళ్యం) ఎన్నికయ్యారు. అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శ్రీదేవి (జెడ్పీ, ఉగ్రాణంపల్లె), హెడ్‌క్వార్టర్ కార్యదర్శిగా మోహన్ (ఎంసీహెచ్‌ఎస్, గిరింపేట), మహిళా కార్యదర్శిగా రత్నమ్మ (జెడ్పీ, ముత్తిరేవుల), చిట్టెమ్మ(జెడ్పీ, పిడివికండ్రిగ) ఎన్నికయ్యారు. అనంతరం కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబమే సీఎం చంద్రబాబు నాయుడుకు అడ్డు. తనకంటే పెద్దిరెడ్డి కుటుంబానికే ఆదరణ పెరుగుతోందని, అందుకే ఆ ఫ్యామిలీ లక్ష్యంగా చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదలు నేటి వరకు పెద్దిరెడ్డి కుటుంబంపై చేపట్టిన వేధింపులే నిదర్శనం అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అందరూ పెద్దిరెడ్డిని ‘పెద్దాయన’ అని పిలుస్తుండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఏడాదిగా సాగుతున్న అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు.
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి, ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో హడావుడి చేశారు. ఏదో జరిగిపోయిందని సీఎం చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ ఏర్పాటు చేసి డీజీపీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని మదనపల్లెకు పంపించారు. తర్వాత ఆ ఘటనపై కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. అయితే అవేవీ ఇప్పటి వరకు రుజువు కాకపోవడంతో చివరకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది.
● రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు అనేక మందిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేశారు. ఇటుక బట్టీల్లోకి చొరబడి వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమల మండలం కమ్మపల్లెలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులందరినీ నెలలపాటు చిత్రహింసలకు గురిచేశారు. కొంత మంది ఊరొదిలి వెళ్లేలా దౌర్జన్యాలకు తెగబడ్డారు. అనేక మందిపై దాడులు చేసి ఆస్పత్రుల పాలు చేశారు. ప్రధానంగా పుంగనూరులో భయానక వాతావరణం సృష్టించారు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేసి రిమాండ్ తరలించి పెద్దిరెడ్డి వర్గాన్ని భయాందోళనకు గురిచేసేందుకు యత్నించారు.
● రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గత ఏడాది జూలై 18న పుంగనూరు పర్యటనలో భాగంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని టీడీపీ గూండాలు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంపై రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను కర్రలు, రాడ్లతో దారుణంగా తరిమికొట్టారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొన్ని వాహనాలను ఎందుకూ పనికిరాకుండా నాశనం చేశారు. దాడి చేసింది టీడీపీ గూండాలైతే.. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు మొత్తం 115 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కూటమి నేతలు కంగుతిన్నారు.
● పులిచెర్ల మండలం మంగళంపేట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన మామిడి తోటలలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయంటూ పచ్చమీడియాను అడ్డుపెట్టి ప్రభుత్వం నానా యాగీ చేసింది. డ్రోన్ కెమెరాలు, అధికారులను రంగంలోకి దింపి హంగామా సృష్టించింది.
● తిరుపతిలోపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ప్రాంతం బుగ్గమఠానికి చెందిన భూముల్లోనే అని ఆరోపించి కూటమి ప్రభుత్వం కోర్టులో కేసులు దాఖలు చేసింది. అదే విధంగా కార్పొరేషన్ నిధులతో దారి ఏర్పాటు చేసుకున్నారని, అది కూడా ఆక్రమణేనంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసింది.
జలయజ్ఞంపై బాబు విషం
కృష్ణమ్మ జలాలను పుంగనూరుకు తీసుకొచ్చి నిల్వ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సంకల్పించారు. నాటి పాదయాత్రలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యను వివరించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులతో పడమటి ప్రాంతాలకు నీరు ఇచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో రూ.1200 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ మూడు ప్రాజెక్టులతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని, ఎన్నికల సమయంలో దీనిని అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై విషం చిమ్మారు. చోటా నేతలచే గ్రీన్ ట్రిబ్యూనల్‌లో తప్పుడు కేసులు వేసి పనులు అడ్డుకున్నారు. దీని కారణంగా పడమటి నియోజకవర్గాలకు జీవజలం లేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంది.
కుట్రలకు పెద్దిరెడ్డి కుటుంబం వెరవదు
పెద్దిరెడ్డి కుటుంబ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిదశగా ఓ బూటకపు మద్యం కుంబకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులోకి ఎలాంటి సంబంధం లేని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో సిట్ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేసింది. ప్రజాభిమానం కలిగిన మిథున్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నాయకుడిపై మద్యం కేసు నమోదు చేయడం దుర్మార్గం.
– నూకతోటి రాజేష్, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
కక్షగట్టి చంద్రబాబు వేధింపులు
పెద్దిరెడ్డి కుటుంబమే లక్ష్యంగా కుట్రలు
సొంత నియోజకవర్గంలో సైతం
తిరగనివ్వకుండా దాడులు
ముందుగా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం పేరుతో నాటకాలు
తర్వాత ప్రభుత్వ, అటవీభూముల ఆక్రమణ అంటూ ఆరోపణలు
చివరకు తప్పుడు కేసులో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేసి వికటాట్టహాసాలు
తప్పుడు కేసులో..
తాజాగా లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసిన ఈ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు సామాన్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు

‘హద్దు’లు దాటిన అక్రమాలు