రైతుపై దాడి | - | Sakshi
Sakshi News home page

రైతుపై దాడి

Jul 20 2025 1:51 PM | Updated on Jul 20 2025 2:43 PM

రైతుపై దాడి

రైతుపై దాడి

శ్రీరంగరాజపురం : పొలం వద్ద పనిచేసుకుంటున్న ఓ రైతుపై నలుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన శనివారం మండలంలో కలకలం రేపింది. బాధితుడి భర్య మోనిషా కథనం.. మండలంలోని పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన మునస్వామికి తన భర్త జగన్నాథంకు మధ్య భూ సమస్యలు ఉన్నాయి. ఈ విషయం కోర్టుదాకా వెళ్లింది. తీరా కోర్టు జన్నాథంకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని మునస్వామి కుటుంబ సభ్యులు యుగంధర్‌, షణ్ముగుం, అరుణాచలం, ధనశేఖర్‌ కలిసి అకారణంగా జగన్నాథంపై దాడి చేసి గాయపరిచారు. స్థానికులు అతన్ని 108 సాయంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుమన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement