
బాధ్యతగా పనిచేయండి
చిత్తూరు కలెక్టరేట్ : నగరకపాలక, మున్సిపల్ కార్యాలయాల్లోని టౌన్ ప్లానింగ్ అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్లు ప్రతి రోజూ ఉదయం శానిటేషన్ ప్రక్రియ పై ప్రత్యేక దృష్టి వహించాలన్నారు.
సంఘాల అభివృద్ధికి చర్యలు
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్‌డీఏ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, డీపీఎం, ఏపీఎంలు పాల్గొన్నారు.
నాణ్యతగా ఉండాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): బస్సుల రిపేర్లలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ఏపీఎస్‌ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ) చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం చిత్తూరు ఆర్టీసీ 1, 2 డిపోలను ఆయన పరిశీలించారు. అనంతరం డీపీటీవో రాము, డీఎంలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ అవసరాలకు తగ్గట్టుగా బస్సుల శాతాన్ని పెంచాలన్నారు. రానున్న కాలంలో బస్సుల్లో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందన్నారు. హ్యాంగింగ్ రాడ్లను బలమైనవిగా అమర్చాలని ఆయన సూచించారు. అనంతరం గ్యారేజ్‌ను తనిఖీ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై పలు సూచనలు చేశారు. డిపో మేనేజర్ క్రిష్ణమూర్తి, సీఐ అల్తాఫ్ పాల్గొన్నారు.