జగన్‌ పర్యటనలో రైతులపై ఎందుకీ ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

జగన్‌ పర్యటనలో రైతులపై ఎందుకీ ఆంక్షలు

Jul 12 2025 8:20 AM | Updated on Jul 12 2025 9:29 AM

జగన్‌ పర్యటనలో రైతులపై ఎందుకీ ఆంక్షలు

జగన్‌ పర్యటనలో రైతులపై ఎందుకీ ఆంక్షలు

● పోలీసుల అణచివేతతోనే భారీగా జనం ● రక్షకభటులే ఇంత కఠినంగా వ్యవహరిస్తే ఎలా? ● ఖాకీల తీరును తప్పుబడుతున్న రైతన్నలు

పలమనేరు/కాణిపాకం: ప్రజలను రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ బుధవారం బంగారుపాళెంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో ఎందుకు వారిపై ఇంత కఠినంగా వ్యవహరించారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారుపాళెంలోకి ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు ఎందుకిలా అడ్డుకున్నారనే మాట రైతుల్లో అయోమయాన్ని కల్గిస్తోంది. ఏ మార్గంలోనూ జనం వెళ్లకుండా ప్రత్యేక చెక్‌ పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. ఎటుచూసినా కర్ఫూ వాతావరణాన్ని సృష్టించారు. కనీసం నడిచి వెళుతున్న వారితోనూ దురుసుగా మాట్లాడారు. ద్విచక్ర వాహనాలకు పెట్రోలు బంకుల్లో పెట్రోలు పట్టనీయకుండా చేశారు. జగన్‌ పర్యనటలో భాగంగా కొన్ని చోట్ల గుమిగూడిన రైతులపై లాఠీతో విరుచుకుపడ్డారు. బంగారుపాళెం మార్కెట్లోని మామిడి రైతులను బయటకు పంపేశారు. వ్యాపారులు లేకుండా చేశారు. అసలు జనాన్ని చూస్తేనే పోలీసులు కోపంతో ఊగిపోయారు. మొత్తం మీద పోలీసులు చేసిన అణచివేత చర్యల కారణంగానే రైతులు వేలాదిగా ఈ కార్యక్రమానికి వచ్చేలా చేసిందనే మాట జనంలో వినిపిస్తోంది. పోలీసులు ఇన్ని రకాలుగా ఆంక్షలు పెట్టి ఉండకపోతే కార్యక్రమం ప్రశాంతంగానే జరిగిపోయేదని అంటున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కొందరి రైతుల మాటల్లోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement