
టీచర్లు నష్టపోకుండా బదిలీలు..
టీచర్లు నష్టపోకుండా బదిలీలు నిర్వహించాలని వైఎస్సార్ టీచర్ అసోసియేషన్ నేతలు డీఈఓకు విన్నవించారు.
సౌర కాంతులు
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వ స్థలాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్‌ను అందించనున్నారు.
సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించింది. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా వాడాలని పేర్కొంది. అయితే ఆస్పత్రుల్లో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కనీస ఏర్పాట్లు కరువయ్యాయి. ఆస్పత్రి అధికారుల్లో నిర్లిప్తత నెలకొంది.
జిల్లాను కరోనా ఫీవర్ పట్టుకుంది. నిత్యం వేలాదిగా తిరుపతి వెళ్లేందుకు భక్తులు చిత్తూరు మీదుగానే వెళుతుంటారు. ఇదే మాదిరిగానే కాణిపాకంకు వేలాదిగా యాత్రికులు తరలివస్తుంటారు. దీనికితోడు తమిళనాడు, కర్ణాటక రాష్రాలు జిల్లా సరిహద్దులోనే ఉంది. స్వామి దర్శనంతో పాటు వివిధ పనుల నిమిత్తం రోజువారీగా సరిహద్దు రాష్ట్రాల నుంచి జిల్లాకు రాకపోకలు చేస్తున్నారు. ఈ తరుణంలో జిల్లాకు కరోనా ముప్పు పొంచి ఉందని పలువురు భావిస్తున్నారు.
గతంలో సుమారు 2 వేల మంది మృతి
2019లో కరోనా కల్లోలం ఉమ్మడి జిల్లా నుంచే మొదలైన సంగతి అందరికీ తెలిసిందే..అప్పట్లో తొలి కేసు శ్రీకాళహస్తీలో నమోదు కాగా ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బెల్ మోగింది. ఇలా 2019 నుంచి 2021 వరకు మూడు దశల్లో కరోనా విజృంభించగా... ఇందులో వేల మంది మృతి చెందిన వారు లేకపోలేదు. కరోనా మూలంగా ఉమ్మడి జిల్లాలో అప్పట్లో సుమారు 2 వేల మందికి పైగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో తిరిగి వైద్య ఆరోగ్యశాఖలో ఆందోళన మొదలైంది.
పెరుగుతున్న కొత్త వేరియంట్లు
కోవిడ్–19 వైరస్ కొత్త వేరియంట్లు, ముఖ్యంగా ఒమిక్రాన్ ఉప–వేరియంట్లు, ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వేరియంట్లలో కోవిడ్ 8.1.3.1.1 వంటి వేరియంట్ల గురించి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఇతర ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఉప–వేరియంట్ ఎక్కువగా వ్యాపిస్తోంది. అమెరికాలో 70 శాతం కోవిడ్ కేసులు. యూకేలో 60 శాతం కేసులు, ఆస్ట్రేలియాలో మూడో అత్యంత ప్రబలమైన వేరియంట్.8.1 ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతుంటడంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఆస్పత్రిలోని బెడ్లు (ఫైల్)
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
జిల్లా సరిహద్దుల్లో కరోనా కేసులు
ముందస్తు జాగ్రత్తలకు ప్రభుత్వం ఆదేశం
అప్రమత్తం కానీ అధికారులు
జాగ్రత్తలు పాటించాలని నిపుణుల సూచన
కోవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది.. ఇప్పటికే విశాఖ, కడప, చైన్నె, బెంగళూరు నగరాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలకు దేశ వ్యాప్తంగా యాత్రికులు వస్తుంటారు. మిగిలిన జిల్లాలతో పోల్చితే ఈ జిల్లాల్లో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇంకా మేల్కోకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు తగిన జాగత్త్రలు పాటిస్తే ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
కనిపించని ముందస్తు చర్యలు
జిల్లాకు కరోనా వ్యాప్తి పొంచి ఉంది. జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికితోడు ఆ రాష్ట్రాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన ఆస్పత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బెడ్లు, ఆక్సిజన్ , వెంటిలేటర్లు , పరీక్ష కిట్లు తదితర ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కోవిడ్ కోసం ప్రత్యేక బెడ్లు కేటాయించడంలో అలసత్వం చూపుతున్నారు. దీని బట్టిచూస్తే జిల్లాకు కరోనా ముప్పు తప్పేలా లేదని ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. గతంలో కరోనా అంటేనే ఆస్పత్రుల్లో చకచకా ముందస్తు ఏర్పాట్లు జరిగేవి. ప్రణాళిక ప్రకారం బెడ్లు కేటాయింపు జరిగేవి. పరీక్షల కోసం కిట్లు అందుబాటులోకి తెచ్చేవారు. సీఎం చంద్రబాబు జిల్లాలోనే ఇంత నిర్లక్ష్యం ఉంటే..మిగతా జిల్లాల పరిస్థితి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కోవిడ్‌కు ముందస్తు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
లక్షణాలు ఇవీ..
జ్వరం, చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ఆరోగ్యశాఖకు చెందిన 24 గంటలు పని చేసే ల్యాబ్‌ల్లో మాస్కులు, పీపీఈ కిట్లు, త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని ఆదేశించింది. వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. ఆరోగ్యశాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పనిచేసే ల్యాబ్‌లో మాస్కును పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులు తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. చైన్నె, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రోగులు తేలికపాటి ఒత్తిడితో బాధ పడుతున్నట్లు గుర్తించారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం
కోవిడ్‌కు సంబంధించి మూడు రోజులకు ముందు ఎలాంటి ఆదేశాలు రాలేదు. శనివారం ఆదేశాలు వచ్చాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తాం. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని ఆస్పత్రులకు ఆదేశాలిస్తాం. బెడ్లు కేటాయిస్తాం. వారికి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం.
– పద్మాంజలి దేవి, డీసీహెచ్‌ఎస్, చిత్తూరు
భయపడాల్సిన పనిలేదు
కొత్త వేరియంట్‌కు భయపడాల్సిన పనిలేదు. అలా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తగిన జాగ్రత్తలతో బయటకు రావాలి. కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలి. వృద్ధులు, చిన్నారుల పట్ల అ ప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికెళ్లి పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యం లేకుండా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి.
– సుధారాణి, డీఎంహెచ్‌ఓ, చిత్తూరు

టీచర్లు నష్టపోకుండా బదిలీలు..

టీచర్లు నష్టపోకుండా బదిలీలు..

టీచర్లు నష్టపోకుండా బదిలీలు..

టీచర్లు నష్టపోకుండా బదిలీలు..

టీచర్లు నష్టపోకుండా బదిలీలు..