రూ.కోట్లు కొల్లగొట్టే స్కామ్‌ | - | Sakshi
Sakshi News home page

రూ.కోట్లు కొల్లగొట్టే స్కామ్‌

May 8 2025 7:55 AM | Updated on May 8 2025 7:55 AM

రూ.కో

రూ.కోట్లు కొల్లగొట్టే స్కామ్‌

చిత్తూరు కార్పొరేషన్‌: మహిళలకు కుట్టు మిషన్లు, శిక్ష ణ పేరుతో కూటమి నాయకులు భారీ మోసానికి తెగబడ్డారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు చిన్నియాదవ్‌, రాష్ట్ర మొదలియార్‌ విభాగం అధ్యక్షుడు జ్ఞానజగదీష్‌, మున్సిపల్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి విమర్శించారు. బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బీసీ, మహిళా విభాగం నాయకులు వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుట్టు మిషన్‌ కొనుగోలుకు రూ.4300, ఒక వ్యక్తి శిక్షణ నిమిత్తం రూ.3 వేలు కలిపి మొత్తం రూ.7,300 ఖర్చు అవుతుందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఒక్కో మహిళకు రూ.23 వేల చొప్పున కేటాయించడం దోపిడీ కాక మరేమిటని ప్రశ్నించారు. వాస్తవంగా లబ్ధిదారులకు అయ్యే ఖర్చు రూ.73 కోట్లు అయితే, ఇతర ఖర్చులు పొను కూటమి నాయకులకు రూ.150 కోట్లు దోచిపెట్టేందుకు పథక రచన చేశారని ఆరోపించారు. బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసగించారని మండిపడ్డారు. బీసీ మహిళలకు కుట్టు శిక్షణ పేరుతో రూ.150 కోట్లకు పైగా దోపిడీ చేస్తున్న కూటమి పాలకులు, త్వరలోనే కమ్మ, కాపు, వైశ్య, క్షత్రియులకు ఈబీసీ కార్పొరేషన్ల పేరుతో మరో రూ.81 కోట్లు నొక్కేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో మహిళా, బీసీ విభాగాలు ముఖ్య నాయకులు అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మి, ప్రతిమారెడ్డి, నారాయణ, త్యాగ, నవీన్‌యాదవ్‌, కవిత, కౌసర్‌, హరిషారెడ్డి, మంజులరెడ్డి, గోపి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

డీఆర్వోకు వినతి

బీసీ మహిళలకు టైలరింగ్‌ శిక్షణ పేరిట కూటమి ప్రభుత్వం రూ.కోట్ల అవినీతికి పాల్పడిందని వైఎస్సార్‌ సీపీ మహిళా, బీసీ విభాగం జిల్లా, రాష్ట్ర నాయకులు విమర్శించారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్వో మోహన్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కుట్టు శిక్షణకు లక్ష మంది బీసీ మహిళలకు రూ.73 కోట్లు పైగా ఖర్చవుతుంటే, చంద్రబాబు ప్రభుత్వం రూ.257 కోట్లు పైగా చూపించడం ఏమిటన్నారు. పెద్ద కంపెనీలకు టెండర్‌ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఎల్‌2, ఎల్‌3 కంపెనీలకు టెండర్‌ కట్టబెట్టి రూ.కోట్లు దోచుకుంటోందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, మహిళలకు న్యాయం చేయాలన్నారు.

రూ.కోట్లు కొల్లగొట్టే స్కామ్‌1
1/1

రూ.కోట్లు కొల్లగొట్టే స్కామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement