
● పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణా ● జిల్లా కేంద్రం నడ
చిత్తూరు టాస్క్‌ఫోర్స్ : సీఎం సొంత జిల్లా కేంద్రంలో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ అక్రమ రవాణా గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. మట్టి అక్రమ రవాణా ఏదో మారుమూల సాగుతోంది అనుకుంటే పొరబాటే. జిల్లా కేంద్రంలోని నడిబొడ్డులో ఉన్న కొత్తబస్టాండ్ పక్కనే ఉన్న పేరొందిన కట్టమంచి చెరువులో ఈ అక్రమ మట్టి రవాణా తతంగం సాగుతోంది. నేలతల్లి కన్నీళ్లు పెట్టేలా ప్రతి రోజు యథేచ్ఛగా మట్టిని అక్రమార్కులు తరలించుకుపోతున్నారు.
అధిక వేగంతో ట్రాక్టర్లు
నగరంలోని కట్టమంచి చెరువులో తవ్వుతున్న మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు అధిక వేగంతో వెళుతున్నాయి. వందల చొప్పున ట్రాక్టర్లు పగటి పూట వేగంగా వెళుతుండడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ట్రాక్టర్లలో మట్టి అక్రమ రవాణా కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. ఇంత తతంగం సాగిస్తున్నప్పటికీ చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కట్టమంచి చెరువులో అక్రమంగా ప్రొక్లైనర్లతో మట్టి తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్లు
రోజుకు వందల లోడ్లు
కట్టమంచి చెరువులో రోజు మూడు ప్రొక్లెయినర్లను పెట్టి మట్టిని తవ్విస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 20 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వుతున్నారు. ప్రతి రోజు వందల ట్రాక్టర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. 15 రోజులుగా రోజుకు వంద లోడ్లు చొప్పున ఉదయం నుంచి రాత్రి వరకు మట్టి అక్రమ రవాణా సాగిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న మట్టిని నగర సరిహద్దులో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలిస్తుండడంతో విమర్శలు గుప్పుమంటున్నాయి. సుందరీకరణ పనుల పేరుతో అక్రమంగా మట్టిని తరలించి జేబులు నింపుకుంటున్న కూటమి ప్రజాప్రతినిధులపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పనులు జరగలేదని అంటున్నారు.
చెరువు ప్రాణాధారం..పల్లెకు, పట్టణానికి ఆయువుపట్టు. జనం పాలిట కల్పతరువు.. ఎందరో మహానుభావుల దాతృత్వంతో వీటిని తవ్వించారు. అయితే కాలక్రమేణ స్వార్థం పెరిగింది. వాటిని ఆక్రమించుకునే ప్రబుద్ధులు పెరిగారు. ఫలితంగా నీటి వనరులు తగ్గిపోయి..తరచూ కరువు తాండవిస్తోంది. ప్రజలతోపాటు జంతువులు, పక్షులకూ నీరు కరువు అవుతోంది. ఆ ఆక్రమణలను తొలగించి ఆధునికీకరించాలని నిర్ణయించారు. నిధులు మంజూరు చేశారు. అయితే నాయకులు కాసుల వేటలో పడి, ఆధునికీకరణ లక్ష్యం నీరుగార్చారు. ఇష్టారాజ్యంగా తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అయినా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తోంది.
ఎమ్మెల్యే దందాకు పరాకాష్ట
కట్టమంచి చెరువు సుందరీకరణకు కలెక్టర్ ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలు ఇచ్చారే తప్ప.. ఇక్కడ మట్టిని తవ్వుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకోమని చెప్పలేదు. ఎమ్మెల్యే చేస్తున్న దందాలకు అక్రమంగా చెరువు మట్టిని తవ్వి వ్యాపారం చేస్తుండడమే నిదర్శనం. ఇప్పటి వరకు దాదాపు 5 వేల లోడ్లకు పైగా మట్టిని అమ్ముకున్నారు. అసలు చెరువులో మట్టి ఎంత తవ్వాలి? ఎంత తవ్వుతున్నారు? ఏం చేస్తున్నారు..? అన్న విషయం గురించి ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. అధికారుల తీరుపై అవసరమైతే ఏసీబీ, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తాం.
– ఎంసీ.విజయానందరెడ్డి,
చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
పేరుకే సుందరీకరణ..
కట్టమంచి చెరువు సుందరీకరణ పనులను గత ఏడాది చేపట్టారు. కట్టమంచి చెరువు పూడికతీత పనులకు చిత్తూరు ఎంపీ దగ్గమళ్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, మేయర్ అముద పాల్గొని, గత ఏడాది సెప్టెంబర్ 24 వ తేదీన భూమి పూజ చేసి ప్రారంభించారు. చిత్తూరు కార్పస్ ఫండ్‌తో సుందరీకరణ పనులు చేపడుతున్నట్టు కూటమి ప్రజాప్రతినిధులు ప్రకటించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో చేయాల్సిన అభివృద్ధి పనులు అనేకం ఉన్నప్పటికీ పూడికతీత పనులకే ప్రాధాన్యం ఇవ్వడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ పనుల ముసుగులో మట్టిని అక్రమంగా తరలించి కూటమి నేతలు జోబులు నింపుకుంటున్నారు.

● పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణా ● జిల్లా కేంద్రం నడ

● పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణా ● జిల్లా కేంద్రం నడ

● పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణా ● జిల్లా కేంద్రం నడ

● పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణా ● జిల్లా కేంద్రం నడ